close

తాజా వార్తలు

రెండు పులులు ఎందుకు కొట్లాడుకున్నాయి?

 

 
 

జయ్‌పూర్‌: ఒక ఆడ పులి కోసం రెండు మగపులుల మధ్య జరిగిన భీకర పోరాట వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని రణతంబోర్‌ నేషనల్‌ పార్కులోని (టి-57) సింగ్త్‌, (టి-58) రాఖీ అనే మగపులులు   (టి-39) నూర్‌ అనే ఆడ పులి కోసం భీకరంగా కొట్లాడుకున్నాయి. సింగ్త్‌, రాఖీ రెండు కూడా ఒకే పులికి జన్మించిన మగపులులని జూ అధికారి పర్వీన్‌ కస్వాన్‌ తెలిపారు. 
ఈ వీడియో మొదట్లో ఒక మగ పులి ఆడ పులితో ఉండగా రెండవ మగ పులి వాటి వద్దకు వచ్చింది. క్రమంగా రెండు మగపులులు పోరాటం మొదలు పెట్టగానే ఆడ పులి నూర్‌ అక్కడ నుంచి పరుగు లంకించుకుంది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో ఉంచిన ఒక రోజులోనే దాదాపు 24 వేల మంది దీనిని వీక్షించారు. వెయ్యికి పైగా కామెంట్లు వచ్చాయి. కొందరు ఈ పోరాటంలో ఎవరు గెలిచారు అని కామెంట్లు పెట్టగా సింగ్త్‌ గెలిచినట్లు జూ అధికారి కస్వాన్‌  తెలిపారు. ఈ పోరాటంలో రెండు పులులకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన వెల్లడించారు. 

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.