close

తాజా వార్తలు

ఆ క్షణంలో..  మృత్యువు ఎదురుగా ఉంటే..

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్ను మూస్తే మరణం.. కన్ను తెరిస్తే జననం.. ఈ రెండింటి మధ్య జరిగేదే జీవన సమరం... చావు ఎదురుగా ఉంటే ఎంతటి వారికైనా క్షణకాలమైనా భయం పుడుతుంది. ఆ క్షణకాలంలో జరిగే పరిణామాలే రేపటి జీవనానికి దోహదపడతాయి. మరణం ఎదురుగా ఉన్నప్పుడు ఏ జీవి అయినా ఇచ్చే హావభావాలు ఎలా ఉంటాయి..? ఆ సమయంలో హావభావాలను చిత్రీకరించే సమయం కూడా ఉంటుందా..? అంటారు కొందరు. కానీ చైనాకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్‌ చావు అంచులను చూస్తున్న పెద్ద ఉడుత  భయాన్ని తన కెమెరాలో బంధించి ఈ సంవత్సరం ఉత్తమ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫీకి ఎంపికయ్యాడు. 
ఒక పెద్ద ఉడుత ముందుకు ఒక్కసారిగా తోడేలు రావడంతో బెదిరిపోయిన ఉడుత ఒక్క ఊదుటున పైకి లేచింది. ఆ సమయంలో ఉడుత తన ప్రాణాలను రక్షించుకోవడానికి పారిపోవాలని ప్రయత్నించినప్పటికీ తోడేలుకు ఉడుతకు మధ్య జరిగిన పోరాటంలో ఉడుత ఓడి ప్రాణాలు విడిచిందని ఫొటోగ్రాఫర్‌ తెలిపారు. ఈ చిత్రానికి గానూ ఈ సంవత్సరం ఉత్తమ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీ అవార్డును అందుకున్నారు ఈ చైనా ఫొటోగ్రాఫర్‌. 
న్యూజిలాండ్‌కు చెందిన మరో ఫొటోగ్రాఫర్‌ 11-14 సంవత్సరాల కేటగిరీలో ఇండోనేషియాలో తీసిన ఓ సముద్ర జీవి చిత్రానికి గానూ ఉత్తమ ఫొటో గ్రాఫర్‌గా అవార్డును అందుకున్నారు. 
ఈ పోటీలు లండన్‌లో నిర్వహించారు. వీటికి దాదాపు 100 దేశాల నుంచి 48,000 దరఖాస్తులు వచ్చాయి


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.