close

తాజా వార్తలు

సిరియాలో 5 రోజుల కాల్పుల విరమణ

ఇది శుభపరిణామం ... ట్రంప్‌ ప్రశంస

వాషింగ్టన్‌‌: ఉత్తర సిరియాలో కుర్దు తిరుగుబాటుదారులకు, మిలటరీ బలగాలకు మధ్య వారం రోజుల నుంచి జరుగుతున్న కాల్పులకు తాత్కాలికంగా తెర పడింది. అమెరికా, టర్కీలు ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొల్పే విషయమై ఒక ఒప్పందానికి వచ్చి, ఐదురోజుల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు సంయుక్త రాష్ట్రాల ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రకటించారు. ఈ మేరకు కుదిరిన ఒప్పందానికి అంగీకరించిన టర్కీ అధ్యక్షుడు ఎడ్రోగాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసించారు. 

టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎడ్రోగాన్‌తో ఈ గురువారం జరిగిన ఏకాంత సమావేశ అనంతరం, టర్కీలో 120 గంటల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినట్లు అమెరికా సంయుక్త రాష్ట్రాల ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ప్రకటించారు. ఈ ప్రకటనను ట్రంప్‌ అభినందిస్తూ ‘‘దీని వల్ల అందరికీ మంచే జరుగుతుంది. వారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. టర్కీ అధ్యక్షుడిపై నా గౌరవం రెట్టింపయింది.’’ అని ప్రకటించారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.