close

తాజా వార్తలు

పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు..!

దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయినట్లు సమాచారం. నవంబరు 18న ప్రారంభమై డిసెంబరు 13వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ లోక్‌సభ, రాజ్యసభ కార్యదర్శులకు షెడ్యూల్‌ పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే పలు ఆర్డినెన్స్‌లు సైతం సభ ముందుకు రానున్నాయి. ఆర్థిక మందగమనం నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చేలా కార్పొరేట్‌ పన్ను తగ్గిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌తో పాటు ఈ-సిగరెట్లు నిషేధానికి సంబంధించిన అత్యవసరాదేశం బిల్లు రూపంలో వచ్చే అవకాశం ఉంది. గత రెండు సంవత్సరాల్లో శీతాకాల సమావేశాలు నవంబరు 21న ప్రారంభమై జనవరి తొలివారంలో ముగిశాయి.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.