close

తాజా వార్తలు

‘ఆ లేఖలు చూసి ఆశ్చర్యపోయా’

కోల్‌కతా: బెంగాల్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆ రాష్ట్ర గవర్నర్‌ జగ్దీప్‌ ధన్కర్‌ మరోసారి తప్పుబట్టారు. రాష్ట్రంలో సెన్సార్‌షిప్‌ జరగుతోందేమో అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటనను సాకుగా చూపుతూ తన సమావేశంలో పాల్గొనేందుకు అధికారులు నిరాకరించడంపై ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. తాను సమావేశానికి పిలిస్తే అధికారులు హాజరుకాలేమనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అసలేం జరిగిందంటే.. జిల్లాల న్యాయమూర్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కావాలని గవర్నర్‌ జగ్దీప్‌ ధన్కర్‌ గత వారం భావించారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో నేటి నుంచి పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల నుంచి అక్కడి అధికారులకు సమాచారం ఇస్తున్నప్పటికీ.. ఉత్తర బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటన నేపథ్యంలో గవర్నర్‌ సమావేశానికి తాము హాజరుకాలేకపోతున్నామంటూ న్యాయమూర్తులు, అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి నిన్న సాయంత్రం గవర్నర్‌ కార్యాలయానికి లేఖలు వచ్చాయని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. సీఎం పర్యటన నేపథ్యంలో తామంతా తీరికలేకుండా ఉంటామని వారు పేర్కొన్నారు. మరోవైపు, అధికారులు గవర్నర్‌ జిల్లా పర్యటనకు ఏర్పాట్లు చేశారు.

దీనిపై గవర్నర్‌ స్పందిస్తూ.. నాలుగు రోజుల ముందు నుంచి సమాచారం ఇచ్చినప్పటికీ జిల్లా అధికారులు తన సమావేశానికి హాజరుకాలేమని లేఖలు రాయడంతో ఆశ్చర్యపోయానన్నారు. బెంగాల్‌లో ఒకరకమైన సెన్సార్‌ షిప్‌ జరుగుతుందేమో నాకు తెలియడంలేదంటూ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తన పర్యటన మాత్రం కొనసాగుతుందని స్పష్టంచేశారు. మమతా సర్కార్‌, గవర్నర్‌ మధ్య పలు అంశాలపై విభేదాలు తలెత్తుతున్నాయి. ఇటీవల కోల్‌కతాలో దుర్గాపూజ కార్నివాల్‌లో కూడా తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ గవర్నర్‌ వాపోయిన విషయం తెలిసిందే.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.