close

తాజా వార్తలు

సీఐసీ పదవీకాలం ఇక మూడేళ్లే

నూతన ఆర్‌టీఐ నిబంధనలను నోటిఫై చేసిన ప్రభుత్వం

న్యూదిల్లీ: సమాచార హక్కు చట్టం కింద నియమితులయ్యే సమాచార కమిషనర్ల పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. పదవీకాలాన్ని మూడేళ్లకు పరిమితం చేస్తూ గురువారం రాత్రి కొత్త ఆర్‌టీఐ నిబంధనలను నోటిఫై చేసింది. దీనిపై ఆర్‌టీఐ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.

ఎన్నికల సంఘం ప్రధానాధికారి, ఎన్నికల కమిషనర్లతో సమానంగా సమాచార చీఫ్‌ కమిషనర్‌, కమిషనర్లు హోదా, వేతనాలు అనుభవిస్తున్న నేపథ్యంలో ఆర్‌టీఐ చట్టం-2005ని కేంద్రం ఈ ఏడాది జులైలో సవరించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నూతన నిబంధనలను ప్రభుత్వం గురువారం రాత్రి నోటిఫై చేసింది. నూతన నిబంధనలు కొత్త నియామకాలకు వర్తిస్తాయి. దీని ప్రకారం వారి వేతనాలు, సర్వీసులను నిర్ధరించే అధికారం ప్రభుత్వానికి దక్కింది. తాజా నిబంధనల ప్రకారం కమిషనర్ల పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గించారు. 2005 చట్టం కింద కమిషనర్లకు ఐదేళ్లు లేదా రిటైర్మెంట్‌ వయస్సు 65 (ఏది ముందయితే అది) పూర్తయ్యే వరకు ఆ పదవిలో ఉండేవారు.

ఆర్‌టీఐ నిబంధనలను మార్చడంపై స.హ. కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సమాచార కమిషనర్ల స్థాయి తగ్గించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సమాచార కమిషనర్లను తన గుప్పిట పెట్టుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపిస్తున్నారు. నిబంధనల రూపకల్పనలో ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోలేదని ఓ ఆర్‌టీఐ కార్యకర్త ఆవేదన వ్యక్తంచేశారు. తాజా నిబంధనలు సమాచార కమిషన్‌ స్వతంత్రను హరించేవిగా ఉన్నాయని మరో కార్యకర్త అభిప్రాయపడ్డారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.