close

తాజా వార్తలు

ప్రపంచం మెచ్చే పర్యాటక దేశంగా భారత్‌

‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆలిండియా రేడియో ద్వారా ఆయన భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని ఆసక్తికర అంశాలను ఆయన ప్రజలతో పంచుకున్నారు. ఈ రోజుల్లో దీపావళి కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహించుకుంటున్నారని అన్నారు. 

* ‘ దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పర్వదినాన అందరూ దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయండి. దీనివల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. సాధ్యమైనంత వరకు స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వండి’.

*‘ ఈ పండుగ రోజున దేశంలో మహిళల ప్రాధాన్యం గురించి మాట్లాడుకుందాం. సోషల్‌ మీడియా వేదికగా ‘Bharat Ki Laxmi’ పేరిట మహిళల విజయగాథలను పంచుకోండి. మీమీ ఇంట్లో ఉన్న మీ కుమార్తెలతో ఆనందంగా గడిపిన క్షణాల గురించి షేర్‌ చేసుకోండి’ అని పిలుపునిచ్చారు.

*‘ప్రతి ఒక్కరూ.. ప్రతి కుటుంబం, ప్రతి గ్రామంలోనూ పరిశుభ్రత మీద అవగాహన వస్తోంది. ఇది శుభపరిణామం అనే చెప్పాలి. ‘స్వచ్ఛ్‌ భారత్‌’ కార్యక్రమం విజయవంతం కావడానికి దేశంలోని 125 కోట్ల మంది కష్టపడ్డారు. ఒక ఉద్యమంలా తీసుకుని ముందుకు కదిలారు’.

*‘గుజరాత్‌లో నర్మదా నది తీరాన ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం ‘స్టేట్‌ ఆఫ్‌ యూనిటీ’ని ఇప్పటివరకు 26 లక్షల మంది సందర్శించారు. ఈ ప్రదేశం అధ్యయనానికి వనరుగా మారుతోంది. ఏడాది కాలంలో ఇంత ఎక్కువ మొత్తంలో పర్యాటకులు వచ్చారంటే సంతోషించాల్సిన విషయం. రాబోయే కాలంలో ప్రపంచం మెచ్చిన పర్యాటకంగా భారత్‌ తయారవ్వబోతోంది’.

*‘గురునానక్‌ దేవ్‌జీ చేసిన సేవలు మరువలేనివి. అస్పృశ్యత వంటి దురాచారాలపై పోరాడిన వ్యక్తి ఆయన. ఎంతో మంది హృదయాల్లో నిలిచిపోయారు’అని అన్నారు.

*ఈ కార్యక్రమంలో ఆయన అయోధ్య అంశాన్నీ ప్రస్తావించారు. అయోధ్యపై తీర్పు ఎలా వస్తుందో తెలీదని, ఎలా వచ్చినా దేశ ప్రజలందరి సంతృప్తే తనకు ముఖ్యమని తెలిపారు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.