close

తాజా వార్తలు

అనిల్‌ కపూర్‌ను మహారాష్ట్ర సీఎం చేయండి

ఫ్యాన్‌ ట్వీట్‌.. అనిల్‌ స్పందన

ముంబయి: ‘మహారాష్ట్ర సీఎంగా అనిల్‌కపూర్‌ను నియమించండి’ అంటూ ఓ అభిమాని పలువురు రాజకీయ ప్రముఖులను ఉద్దేశిస్తూ సోషల్‌మీడియా వేదికగా ఓ ట్వీట్‌ పెట్టాడు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా - శివసేన కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంపూర్ణ ఆధిక్యం సాధించినప్పటికీ అధికారం పంచుకునే విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే దానిలో ఇరు పార్టీలు తర్జన భర్జన అవుతున్నాయి.

ఈ క్రమంలో ఓ సినీ అభిమాని ట్విటర్‌ వేదికగా ‘అనిల్‌ కపూర్‌ను మహారాష్ట్ర సీఎంగా నియమించండి’ అంటూ ట్వీట్‌ చేశాడు. ‘మహారాష్ట్ర సీఎంగా ఎవరిని నియమించాలనే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే వరకు అనిల్‌ కపూర్‌ను ఎందుకు సీఎంగా చేయకూడదు. ఆయన ఒక్కరోజు సీఎంగా నటించిన ‘నాయక్‌’ సినిమాను ప్రతి ఒక్కరూ చూశారు. ఆ సినిమా ద్వారా ఆయన ఎందరినో ఆకట్టుకున్నారు. ఏమంటారు దేవేంద్ర ఫడణవీస్‌‌, ఆదిత్య ఠాక్రే.’ అని సదరు అభిమాని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌ చూసిన అనిల్‌ కపూర్‌ ట్విటర్‌ వేదికగా ఆ అభిమానికి రిప్లై ఇచ్చారు. ‘నటుడిగా నా జీవితం బాగుంది.’ అని అనిల్‌ కపూర్‌ తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.