
తాజా వార్తలు
ముంబయి: ప్రభుత్వ ఏర్పాటుపై మిత్ర పక్షం భాజపాతో చర్చలు జరిగితే అది సీఎం పదవిపైనే జరుగుతాయని శివసేన అదివారం స్పష్టం చేసింది. అయితే, ఇప్పటివరకూ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలేవీ జరగలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ అన్నారు. చెరి సగం కాలం సీఎం పదవిని పంచుకోవాలనే శివసేన డిమాండ్‌కు భాజపా అంగీకరించని సంగతి తెలిసిందే. సీఎంగా తానే ఐదేళ్లపాటూ కొనసాగుతానని కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తేల్చి చెప్పారు.
మహారాష్ట్రలో భాజపా ఒకవేళ రాష్ట్రపతి పాలన విధిస్తే అది పార్టీకి పెద్ద పరాజయం అయినట్లవుతుందని శివసేన పత్రిక సామనాలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తన వీక్లీ కాలమ్‌లో వివరించారు. రాష్ట్రంలో అసెంబ్లీ గడువు నవంబరు 7తో ముగియననున్న సంగతి తెలిసిందే. ఆ లోపు ప్రభుత్వం ఏర్పాటు కాకుంటే రాష్ట్రపతి పాలన అనివార్యమవుతుందని భాజపా మంత్రి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 105 సీట్లతో భాజపా పెద్ద పార్టీగా అవతరించినా మెజారిటీ మాత్రం సాధించలేదు. ఇంకా 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముంది. 56 సీట్లతో శివసేన రెండో పెద్ద పార్టీగా నిలిచింది. తర్వాతి స్థానంలో ఎన్సీపీ(54), కాంగ్రెస్ (44) ఉన్నాయి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
