
తాజా వార్తలు
ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయం ఉద్ధవ్దేనని ఆ పార్టీ తీర్మానం
ముంబయి: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. అసెంబ్లీ గడువు 9వ తేదీతో ముగియనుండటంతో పార్టీలు చకచకా పావులు కదుపుతున్నాయి. ఓ వైపు గవర్నర్‌ను కలిసేందుకు భాజపా సిద్ధమవుతున్న వేళ.. తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా శివసేన జాగ్రత్త పడుతోంది. వారిని ముంబయిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు తరలించేందుకు గదులు సిద్ధం చేసినట్లు సమాచారం. అలాంటిదేమీ లేదని శివసేన తోసిపుచ్చుతోంది.
సీఎం పదవిని చెరిసగం పంచుకోవాలంటూ గత కొన్ని రోజులుగా శివసేన పట్టుబడుతూ వస్తోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో భాజపా- శివసేన మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించిన సేనకు ఎన్సీపీ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షంలోనే కూర్చుంటామని, కలిసొచ్చేది లేదని ఆ పార్టీ స్పష్టం చేసిన నేపథ్యంలో శివసేన కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించినా.. గురువారం తన పంతం వీడేది లేదని మరోసారి స్పష్టం చేసింది. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించకుండా వారిని తరలించేందుకు ముందు జాగ్రత్తగా ఓ హోటల్లో గదులు బుక్ చేసి సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. ఈ వార్తలను ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ఖండించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని, అయినా వారి జోలికొచ్చే సాహసం ఎవరూ చేయబోరని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నవారు తమ సొంత పార్టీ ఎమ్మెల్యేల గురించి ముందు ఆందోళన చెందాలని అన్నారు. శివసేనకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠిస్తారని పునరుద్ఘాటించారు.
నిర్ణయం ఉద్ధవ్‌దే..: ఎమ్మెల్యేలు
మరోవైపు శివసేన ఎమ్మెల్యే ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ నివాసంలో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉద్ధవ్దేనంటూ తీర్మానించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే దేశాయ్ మీడియాకు వెల్లడించారు. హోటల్ గదులకు శివసేన ఎమ్మెల్యేలను తరలిస్తారన్న వార్తలను ఆయన సైతం ఖండించారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ట్రైనీ ఐపీఎస్ సస్పెన్షన్
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
