close

తాజా వార్తలు

‘ట్రంపరితనమే అందరినీ మేల్కొల్పుతోంది..!’

పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థెన్‌బర్గ్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాతావరణ మార్పులపై వ్యవహరిస్తున్న తీరు ‘చాలా ప్రమాదకరమైంది’ అని పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థెన్‌బర్గ్‌ అభిప్రాయపడింది. ఆయన తీరే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని మేల్కొలిపి ఒక ఉద్యమానికి దారి తీసిందని వ్యాఖ్యానించింది.  ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ఏఎఫ్‌పీకి ఇచ్చిన ముఖాముఖిలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. గత మూడు నెలలుగా ఉత్తర అమెరికాలో తండ్రితో కలిసి అనేక అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె మంగళవారం యూరప్‌కు బయలుదేరి వెళ్లింది. ‘‘ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. భూతాపం విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ఓ రకంగా ప్రజల్ని మేల్కొల్పుతోందని భావిస్తున్నాను’’ అని థెన్‌బర్గ్‌  వ్యాఖ్యానించింది. వాతావరణ మార్పులపై ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కార్యాచరణ ప్రారంభవడం శుభపరిణామమన్నారు. అయితే వాతారణ అత్యవసర పరిస్థితులను గుర్తించలేక కార్యాచరణ మొదలుపెట్టడానికి కొన్ని నెలల పాటు జాప్యం జరిగిందని అభిప్రాయపడింది. యూరప్‌లో ప్రముఖ బ్రిటిష్‌ సెయిలర్‌ నిక్కీ హేండర్సన్‌ సహా అక్కడి యువతతో కలిసి ఆమె అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

స్వీడన్‌కు చెందిన 16ఏళ్ల గ్రెటా థెన్‌బర్గ్‌ కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. గతేడాది ఆ దేశ పార్లమెంట్‌ ముందు ఒంటరిగా ధర్నాకు దిగి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. స్కూల్‌కు సెలవు పెట్టి మరీ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు మద్దతుగా నిలిచారు. ‘మా కలల్ని చిదిమేస్తున్నారు.. మా బాల్యాన్ని దోచుకుంటున్నారు.. మీకెంత ధైర్యం’ అంటూ ఇటీవల ఐరాసలో చేసిన ప్రసంగం ప్రజల్ని ఆలోచింపజేసింది. ఇటీవల 84 దేశాలకు సభ్యత్వం ఉన్న నోర్డియాక్‌ కౌన్సిల్‌ ప్రకటించిన ‘ఎన్విరాన్‌మెంటల్‌ అవార్డు’ను కూడా ఆమె తిరస్కరించింది. పర్యావరణంపై చేస్తున్న పోరాటానికి అవార్డులు అవసరం లేదని.. నేతలు స్పందిస్తే చాలని ఆమె అభిప్రాయపడింది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.