
తాజా వార్తలు
ముంబయి: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తన వ్యక్తిగత ట్విటర్ ఖాతాలో పలు మార్పులు చేశారు. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియడానికి ఒక రోజు ముందు ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయనను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఫడణవీస్ తాజాగా ఆయన తన ట్విటర్ ఖాతా బయో నుంచి ముఖ్యమంత్రి అన్న పదాన్ని తొలగించారు. దాని స్థానంలో సేవకుడు అనే అర్థం వచ్చేలా ‘మహారాష్ట్ర సేవక్’ అనే పదాన్ని చేర్చారు.
ఎన్నికల్లో భాజపా, శివసేన కూటమి విజయం సాధించినప్పటికీ సీఎం పదవిని చెరి రెండున్నర సంవత్సరాలు పంచుకోవాలని శివసేన పట్టుపట్టింది. దీంతో ఇరువర్గాల మధ్య దూరం పెరిగి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని గవర్నర్‌కి తెలిపింది. గవర్నర్ ఆహ్వానం మేరకు శివసేన, ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. దీంతో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి నివేదిక సమర్పించారు. దానిపై అత్యవసరంగా భేటీ అయిన కేంద్ర కేబినెట్ దాన్ని ఆమోదించింది. గవర్నర్ నివేదిక, కేబినెట్ తీర్మానంపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
