
తాజా వార్తలు
‘సుప్రీం’ తీర్పు రాహుల్‌కు ఎదురు దెబ్బలాంటిది: జీవీఎల్
దిల్లీ: ‘రఫేల్’యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు సున్నితంగా హెచ్చరించిన నేపథ్యంలో భాజపా నేతలు స్పందిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఇదో ఎదురు దెబ్బలాంటిదని, ఆయన మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారని భావిస్తున్నానని భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. ‘సత్యమే విజయం సాధించింది.. సత్యాన్ని బాధపెట్టగలరేమో గానీ ఓడించలేరు’ అని భాజపా అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ పేర్కొన్నారు. ‘రఫేల్‌పై రాహుల్ గాంధీ చెప్పిన అబద్ధాలను యావత్ ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అన్ని రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది’ అని భాజపా నేత అమిత్ మాలవీయ పేర్కొన్నారు.
రఫేల్ వ్యవహారంలో సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట లభించిన విషయం తెలిసిందే. గతంలో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ప్రధానిని ఉద్దేశించి ‘చౌకీదార్ చోర్’ అంటూ సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా ఆపాదిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై భాజపా ఎంపీ మీనాక్షీ లేఖీ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను సుప్రీంకోర్టు సున్నితంగా హెచ్చరించింది. ‘భవిష్యత్‌లో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించింది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
- ‘కబీర్‌సింగ్’ సీన్లుఇబ్బంది పెట్టాయని తెలుసు!
- నా జీవితంలో గొప్ప విషయమిదే: రాహుల్ సిప్లిగంజ్
- రూ.3.5 కోట్లు ఫ్రిడ్జ్‌లో పెట్టి..!
- గ్లూటెన్ ఉంటే ఏంటి?
- బాలయ్య సినిమాలో విలన్‌గా శ్రీకాంత్..?
- ఈగల్ 2.0 రోబో టీచరమ్మ!
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
