
తాజా వార్తలు
దిల్లీ: దిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. వాయుకాలుష్యం పెరగడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సరి-బేసి విధానం అమల్లో ఉన్న రోజుల్లో వాయుకాలుష్య తీవ్రత వివరాలను కేంద్ర కాలుష్యనియంత్రణ మండలి సుప్రీంకోర్టుకు అందజేసింది. ఆ వివరాలను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సరి-బేసి విధానం అమలు వల్ల ఉపయోగం లేదని, ఆ విధానం అమల్లో ఉన్న రోజుల్లో కూడా గాలి కాలుష్యం తగ్గలేదని తెలిపింది. పంజాబ్, హరియాణా, యూపీ, దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నవంబరు 29న సుప్రీంకోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కాలుష్య నియంత్రణకు ప్రభావవంతమైన చర్యలు తీసుకోవడంలో రాష్ట్రాలు వైఫల్యం చెందాయని, సరి-బేసి విధానం కాలుష్య నియంత్రణకు సరైన పరిష్కారం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
దిల్లీలో ఇంకా డీజిల్, కిరోసిన్ వాహనాల వినియోగాన్ని ఎందుకు నివారించలేకపోతున్నారో చెప్పాలని దిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. నియంత్రణ చేయలేకపోయిన అధికారులను ఎందుకు బాధ్యులను చేయకూడదని వ్యాఖ్యానించింది. డీజిల్, కిరోసిన్‌తో నడిచే ట్రక్కులు, ఆటోలు, ట్రాలీలపై నిషేధం ఉన్నా ఎందుకు తిరుగుతున్నాయని ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం.. కాలుష్య కారక ఇంధనాలతో నడిచే వాహనాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే వాహన యజమానులతో పాటు అధికారులు కూడా బాధ్యులు అవుతారని న్యాయస్థానం స్పష్టం చేసింది. ద్విచక్ర, మూడు చక్రాల వాహనాల కారణంగా వెలువడే కాలుష్యంపై ఏడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని దిల్లీ కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. దిల్లీలో గాలి నాణ్యత పెంచడానికి సరైన మార్గదర్శకాలను ఏడు రోజుల్లోగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
