
తాజా వార్తలు
దిల్లీ: నగరంలో వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని దిల్లీ ప్రభుత్వం నవంబర్ 4 నుంచి ప్రారంభించిన సరి-బేసి విధానాన్ని ఇంకా పొడిగించేది లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. నేటితో ఈ విధానం ముగుస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వాతావరణ శాఖ తెలిపిన దాన్ని బట్టి 2-3 రోజుల్లో గాలి కాలుష్యం మామూలు స్థితికి వచ్చే సూచనలు ఉన్నాయన్నారు. అందువల్ల ఇంకా సరి-బేసి విధానాన్ని ఉంచి అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం అవుతుందని ఆయన తెలిపారు. దీన్ని కొనసాగించాలా?వద్దా? అనేదానిపై సోమవారం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
Tags :