
తాజా వార్తలు
కొలంబో: నేడు అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న శ్రీలంకలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ దుండగుడు ఓటర్లను తీసుకెళ్తున్న ఓ బస్సు కాన్వాయ్‌పై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈరోజు ఉదయం 7గంటలకు దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది మైనారిటీ ఓటర్లను బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఓ దుండగుడు కాన్వాయ్‌పైకి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. రాళ్లు కూడా రువ్వాడని పోలీసులు తెలిపారు. కొలంబోకు ఉత్తర దిశగా 240 కి.మీ దూరంలో ఉన్న తంతిరిమలే పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 100బస్సులున్న కాన్వాయ్‌ని అడ్డుకునేలా రోడ్లపై దుండగులు టైర్లు తగలబెట్టారని తెలిపారు.
శ్రీలంక అధ్యక్ష పదవికి శనివారం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. గత ఏప్రిల్‌లో ఈస్టర్ సండే రోజున జిహాదీ ఉగ్రవాదులు కొలంబోలోని సెయింట్ ఆంటోనీ చర్చిలో బాంబు దాడులు చేసిన సంఘటన ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన సమస్య అని సామాన్య ఓటర్లు భావిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రంగంలో 35 మంది ఉన్నా ప్రధాన పోటీ ముగ్గురి మధ్యే ఉంది. గొటబాయ రాజపక్స, సాజిత్ ప్రేమదాస, అనూర దిస్సననాయకేల మధ్య త్రిముఖ పోటీ జరుగుతోంది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ట్రైనీ ఐపీఎస్ సస్పెన్షన్
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
