close

తాజా వార్తలు

‘రక్షణ ఇవ్వకపోయినా శబరిమల వెళ్తా’

మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్

తిరువనంతపురం: ప్రభుత్వం తరఫున రక్షణ కల్పించినా.. కల్పించకపోయినా.. నవంబర్‌ 20 తర్వాత శబరిమలకు వెళ్లి తీరతానని మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్‌ అన్నారు. ‘‘నవంబర్‌ 20 తర్వాత నేను శబరిమలకు వెళ్తా. కేరళ ప్రభుత్వం నుంచి రక్షణ కోరతా. అయితే భద్రత కల్పించాలా.. వద్దా అనే అంశాన్ని ప్రభుత్వానికే వదిలేస్తున్నాను. ఒకవేళ ఇవ్వకపోయినా నేను అయ్యప్ప దర్శనార్థం శబరిమలను సందర్శిస్తా’’ అని తృప్తి దేశాయ్ ప్రకటించారు. కేవలం ప్రచారం కోసం శబరిమలకు రావాలనుకునే మహిళలకు రక్షణ కల్పించబోమని కేరళ దేవాదాయ మంత్రి సురేంద్రన్‌ ప్రకటించిన నేపథ్యంలో తృప్తి దేశాయ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆందోళనలు నిర్వహించడానికి శబరిమల వేదిక కాదని మంత్రి తేల్చి చెప్పారు. కేవలం ప్రచారం కోసం ఆలయ ప్రవేశం చేస్తామని చెప్పేవారికి ప్రభుత్వ ఎలాంటి మద్దతు ఇవ్వదని వెల్లడించారు. ఒకవేళ 10-50ఏళ్లలోపు మహిళలు వెళ్లాలనుకుంటే అందుకు అనుగుణంగా కోర్టు ఉత్తర్వులు తెచ్చుకోవాలని సూచించారు. నేడు శబరిమల ఆయల తలుపులు తెరుచుకోనున్నాయి. ఆదివారం నుంచి భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.