close

తాజా వార్తలు

శ్రీలంక ఎన్నికల్లో రాజపక్స ఘన విజయం

కొలంబో: పొరుగున ఉన్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గొటాబయ రాజపక్స ఘన విజయం సాధించారు. శనివారం అక్కడ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ జరిగింది. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి రాజపక్స దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో రాజపక్స ఘన విజయం సాధించినట్లు ఆయన అధికార ప్రతినిధి కెహేలియా రాంబూక్‌వెల్లా  మీడియాకు వెల్లడించారు. తమకు 53-54 శాతం ఓట్లు వచ్చినట్లు తెలిపారు. అయితే అధికారికంగా ఫలితాలు ఈ సాయంత్రం వెల్లడికానున్నాయి. రక్షణ శాఖ మాజీ క్యార్యదర్శి అయిన గొటాబయ.. మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స సోదరుడు. 2009లో జరిగిన గొడవల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఆయనపై ఆరోపణలున్నాయి.
15 ఏళ్లుగా శ్రీలంకలో ఆర్థికాభివృద్ధి మందగించింది. దీనికి తోడు అక్కడ ఈస్టర్ సండేరోజున జరిగిన ఆత్మాహుతి దాడితో పర్యాటక ఆదాయానికి గండిపడింది. ఇన్ని సమస్యల నడుమ శనివారం అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. 22 మిలియన్ల శ్రీలంక జనాభా భవిష్యత్తును కాపాడతానంటూ గొటాబయ హామీల వర్షం కురిపించారు. మరోవైపు ఈస్టర్‌ సండేనాడు జరిగిన ఆత్మాహుతి దాడుల వల్ల రణిల్‌ విక్రమసింఘే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ముందస్తు సమాచారం అందినప్పటికీ దాడులు జరక్కుండా చర్యలు తీసుకోవడంలో విఫలమైంది.

మోదీ అభినందన
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన గొటబయ రాజపక్సకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. రెండు దేశాలు సోదరభావంతో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై రాజపక్స స్పందిస్తూ.. తనను అభినందించిన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాలది చారిత్రక బంధమని అన్నారు. తమ స్నేహాన్ని బలోపేతం చేయడంతో పాటు సమీప భవిష్యత్‌లో మిమ్మల్ని (మోదీ) కలుసుకునేందుకు తాను సైతం ఎదురుచూస్తున్నాని పేర్కొన్నారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.