
తాజా వార్తలు
ఆహార పధార్థాల జాబితా విడుదలచేసిన యునిసెఫ్
న్యూదిల్లీ: పిల్లల్లో నానాటికీ పెరుగుతున్న పోషకార లోపం సమస్యను అధిగమించడం కోసం యునిసెఫ్ తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు ఉన్న ఆహార పదార్థాల జాబితా, వాటి తయారీకి సంబంధించిన పుస్తకాన్ని విడుదల చేసింది. కేవలం రూ.20 ఖర్చుతో తక్కువ బరువు, ఊబకాయం, ఎనీమియా సమస్యలను అధిగమించొచ్చని యునిసెఫ్ తాజా నివేదికలో పేర్కొంది. ఈ మేరకు వంటకాల జాబితాతో కూడిన 28 పేజీల బుక్లెట్ని విడుదలచేసింది. తక్కువ బరువుతో బాధపడుతున్న వారికి ఊతప్పం, ఆలూ పరోటా, పనీర్ కతి రోల్, సాగో కట్లెట్, ఊబకాయంతో బాధపడుతున్న వారికి దాల్ పరోటా, పోహా, వెజిటబుల్ ఉప్మా వంటి ఆహార పదార్థాలను అందించటం ద్వారా ఆ సమస్యలను అధిగమించొచ్చని యునిసెఫ్ తన పుస్తకంలో పేర్కొంది.
2016-18 నేషనల్ న్యూట్రిషన్ సర్వే నివేదికల ప్రకారం 5 ఏళ్ల వయస్పులోపు పిల్లల్లో 35 శాతం మంది ఎదుగుదల లోపంతో, 17 శాతం మంది అనారోగ్యంతోనూ, 33 శాతం మంది తక్కువ బరువుతోనూ బాధపడుతున్నారు. 40 శాతం మంది బాలికలు, 18 శాతం బాలురు ఎనీమియాతో బాధపడుతున్నట్లు తేలింది. పోషకాహార లోపంతో చిన్నతనంలోనే అధిక బరువు, ఊబకాయం సమస్యల బారిన పడుతున్నారు. దాని కారణంగా రాబోయే కాలంలో ఎక్కువ శాతం పాఠశాల పిల్లలు, కౌమార దశలో ఉన్న వారు డయాబెటిక్ బారిన పడే అవకాశం ఉన్నట్లుగా సర్వే పేర్కొంది. ఈ సర్వే ఆధారంగా చేసుకుని పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు యునిసెఫ్ ఈ పుస్తకాన్ని విడుదల చేసింది.
దీని గురించి యునిసెఫ్ చీఫ్ హెన్రీట్టా హెచ్ ఫోరే మాట్లాడుతూ ఈ పుస్తకంలో ప్రొటీన్, కార్బోహైడ్రేడ్, ఫ్యాట్, ఫైబర్, ఐరన్, విటమిన్ సీ, క్యాల్షియంలను ఏయే సందర్భాల్లో అందిచాలనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉందన్నారు. త్వరలో దీన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించి అందరికీ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
