close

తాజా వార్తలు

ఆ రోజొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

కథియార్‌ (బిహార్‌): ఆర్టికల్‌ 370 రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం తన చిరకాల కోరికలని, ఆ రెండూ తీరాయని కేంద్రమంత్రి, భాజపా నేత గిరిరాజ్‌ సింగ్‌ అన్నారు. ఇక తాను రాజకీయాల నుంచి వైదొలిగే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జనాభా నియంత్రణకు చట్టం తీసుకొచ్చిన రోజు తాను తప్పకుండా ఆ పనిచేస్తానని చెప్పుకొచ్చారు. దేశ జనాభా పెరిగిపోవడానికి ఓ వర్గం ప్రజలే కారణమంటూ ఆయన పలుమార్లు వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కలిగిన వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటిస్తూ అసోం ప్రభుత్వం తీసుకొచ్చిన ఇద్దరు పిల్లల పాలసీని ఈ సందర్భంగా కొనియాడారు. దేశ జనాభా పెరుగుదలను రెండో దశ క్యాన్సర్‌తో ఓ సందర్భంలో పోల్చారు. 2020 బిహార్‌ ఎన్నికల గురించి ప్రస్తావించగా.. నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోనే తమ కూటమి ఎన్నికలకు వెళుతుందని, ఈ విషయాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఇది వరకే స్పష్టంచేశారని గిరిరాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.