close

తాజా వార్తలు

కర్తార్‌పూర్‌కు పెరుగుతున్న యాత్రికుల తాకిడి

దిల్లీ: కర్తార్‌పూర్‌కు భారత్‌ నుంచి వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈనెల 9న కర్తార్‌పూర్‌ నడవాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. గురునానక్‌ 550వ జయంతిని పురస్కరించుకుని సిక్కు భక్తుల సౌకర్యార్థం దీన్ని ప్రారంభించారు. భారత్‌ నుంచి వెళ్లే సిక్కు యాత్రికుల సంఖ్యక్రమంగా పెరిగినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. దీన్ని ప్రారంభించిన రోజు 562 మంది దర్శించుకోగా.. గురునానక్‌ జయంతి రోజు 546 మంది దర్శించుకున్నారు. ఇక సాధారణ రోజుల్లోనూ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. నవంబరు 10న 229మంది, 11న 122 మంది, 13న 279మంది, 14న 241 మంది, 15న 161 మంది, 16న 402 మంది, 17న 671 మంది దర్శించున్నారని తెలిపారు. వచ్చే ఆదివారం సుమారు 1,800 మంది భక్తులు కర్తార్‌పూర్‌కు రావడానికి పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.