close

తాజా వార్తలు

సీజేఐగా జస్టిస్‌ బోబ్డే ప్రమాణ స్వీకారం

దిల్లీ: సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ పదవిలో ఆయన 17 నెలల పాటు కొనసాగనున్నారు. 2021 ఏప్రిల్‌ 23న పదవీ విరమణ చేయనున్నారు.

జస్టిస్‌ బాబ్డే ప్రొఫైల్‌ ఇదీ..

ఈయన పూర్తి పేరు శరద్‌ అరవింద్‌ బాబ్డే. 1956 ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించారు. బీఏ,ఎల్‌ఎల్‌ఎం విద్యను అభ్యసించారు. 1978లో మహారాష్ట్ర బార్‌కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌లో సుమారు 21ఏళ్లు న్యాయవాదిగా పనిచేశారు. 2000 మార్చి 29న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 అక్టోబరు 16న మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2013 ఏప్రిల్‌ 12న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.