close

తాజా వార్తలు

సరి -బేసి విధానం పొడిగించం: కేజ్రీవాల్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నగరంలో వాయు కాలుష్య తీవ్రత కొంత మేర తగ్గిందనీ.. అందుకే ‘సరి-బేసి’ విధానాన్ని పొడిగించాల్సిన అవసరం లేదని నిర్ణయించినట్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టంచేశారు. దిల్లీలో వాయు కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరడంతో నవంబర్‌ 4 నుంచి 15 వరకు ఈ విధానాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో పాటు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు. అయితే, సరి-బేసి విధానాన్ని పొడిగించే అంశంపై ఈ రోజు నిర్ణయం తీసుకుంటానని ఇప్పటికే ప్రకటించిన కేజ్రీవాల్‌.. ప్రస్తుతం దిల్లీలో వాతావరణ పరిస్థితులు మెరుగ్గానే ఉన్నందున దీన్ని పొడిగించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. మరోవైపు, కాలుష్య నియంత్రణకు ‘సరి-బేసి’ విధానం శాశ్వత పరిష్కారం కాదని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టంచేసింది. దిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేజ్రీవాల్‌ సర్కార్‌ అమల్లో తీసుకొచ్చిన ఈ ‘సరి-బేసి’ విధానాన్ని తొలిసారిగా 2006లో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాహనాల నుంచి వచ్చే పొగ ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఇప్పటి వరకు దీన్ని మూడుసార్లు అమలు చేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.