close

తాజా వార్తలు

బయటే భాయీ.. ఆఫీసులో కాదోయీ!

భువనేశ్వర్‌ :  ఆఫీసులో పై అధికారులని కిందిస్థాయి సిబ్బంది గౌరవంగా పిలవాలని సూచిస్తోంది ఒడిశా ప్రభుత్వం. కొంత మంది జూనియర్‌ అధికారులు సీనియర్లను హుందాగా పిలవకపోవడమే ఈ సూచన వెనుకున్న అసలు కారణం. ఒడిశాలో పనిచేసే పై అధికారులను కిందిస్థాయి సిబ్బంది ‘భాయ్‌’ అని పిలవడం పరిపాటిగా మారిందట. దీంతో ఆ రాష్ట్ర పశుసంవర్థక, పశువైద్యశాఖ అధికారులు ప్రత్యేకంగా ఓ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అందులో సీనియర్‌ అధికారులను భాయ్‌ అని పిలవడం సబబు కాదని పేర్కొన్నారు. డైరెక్టరేట్‌లో పనిచేసే కొందరు కిందిస్థాయి ఉద్యోగులు, క్షేత్రస్థాయి అధికారులు, సాంకేతిక సిబ్బంది తమ సీనియర్ల పట్ల హుందాగా నడుచుకోకుండా భాయ్‌ అంటూ సంబోధిస్తున్నారని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వ శాఖలోనైనా సరే ఉన్నతాధికారులను గౌరవంగా సంబోధించాలని, వ్యక్తిగతంగా అనుబంధాలున్నప్పటికీ ఆఫీసు, దాని పరిసరాల్లో సత్ప్రవర్తనతో మెలగాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ నిబంధనలు పాటించకపోతే ఒడిశా ప్రభుత్వ నియమావళి 1959ని ఉల్లంఘించడమే అవుతుందని ప్రస్తావించారు. అలాంటి వారిపై చర్యలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 16న పశుసంవర్థక, పశువైద్యసేవల శాఖ డైరెక్టర్‌ రత్నాకర్‌ రౌత్‌ పేరుతో ఈ నోటిఫికేషన్‌ విడుదలైంది. 


 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.