
తాజా వార్తలు
దిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్‌సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించడంపై కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టారు. దీంతో సభాపతి ఓంబిర్లా విపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనంతరం కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురీ మాట్లాడుతూ.. గాంధీ కుటుంబసభ్యులు సామాన్య వ్యక్తులు కారని, ఇంత అత్యవసరంగా వారికి ఎస్పీజీ భద్రతను ఎందుకు ఉపసంహరించారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను ప్రజలకు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం భద్రత ఉపసంహరించిందని ఆరోపించారు. దీనిపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేయడంతో హోంమంత్రి అమిత్ షా సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం కాంగ్రెస్ సభ్యులు కూడా అసహనం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- టీమిండియా సమష్టి విజయం
- ఉతికి ఆరేశారు
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
