
తాజా వార్తలు
ఛండీగఢ్: హరియాణా కేబినెట్ కమిటీ తొలి సమావేశంలో రాష్ట్ర మంత్రులకు ఇంటి అద్దె భత్యం(హెచ్ఆర్ఏ) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హరియాణాలో భాజపా, జేజేపీల కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సోమవారం ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరిగింది. హరియాణా మంత్రుల హెచ్ఆర్ఏ 1972 నిబంధనలను సవరించి ఆ భత్యాన్ని రెట్టింపు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ రాష్ట్ర మంత్రులకు రూ.50వేలు ఇస్తుండగా.. ప్రస్తుతం రూ.80వేలు అద్దె, రూ.20వేలు కరెంటు, నీటి బిల్లులు మొత్తం లక్ష రూపాయలు హెచ్ఆర్ఏ కింద రానున్నాయి. దీంతో పాటు రాష్ట్ర యువత, ఎన్ఆర్ఐల కోసం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. వారి సంక్షేమం, ఉపాధి, పెట్టుబడుల కోసం ప్రపంచ సహకార శాఖ పేరుతో వారికి అవకాశాలు కల్పించేందుకు నూతన విభాగాన్ని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
గతనెలలో హరియాణా శాసనసభకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఫలితాల అనంతరం భాజపాకు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోయే బలం లేకపోవడంతో జననాయక్ జనతా పార్టీ నేత దుశ్యంత్ చౌతాలాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 10మంది సభ్యులతో మంత్రివర్గం ఏర్పాటు చేసింది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఉతికి ఆరేశారు
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
