
తాజా వార్తలు
దిల్లీ : ప్రపంచస్థాయి ప్రమాణాలతో జాతీయ పోలీసు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పేందుకు కేంద్రం యోచిస్తోంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటులో వెల్లడించారు. పోలీసింగ్, లా ఎన్ఫోర్స్మెంట్, అంతర్గత భద్రత, ప్రజాభద్రత వంటి అంశాలపై ఈ విశ్వవిద్యాలయంలో విద్య, పరిశోధనలకు అవకాశం ఉంటుంది. ఇందులో చేరేవారికి పోలీస్ సైన్స్స్, సైబర్ ఫోరెన్సిక్, విపత్తు నిర్వహణ, క్రిమినాలజీ వంటి కోర్సులు ఉంటాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ విశ్వవిద్యాలయానికి వెచ్చించే మొత్తం నిధులను కేంద్రమే భరిస్తుందని తెలిపారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన జాతీయ పోలీసు విశ్వవిద్యాలయ చట్టం ప్రకారం యూనివర్సిటీ విధివిధానాలుంటాయని వెల్లడించారు.
పోలీస్, శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశాలు. పోలీసు విభాగం పరిపాలనలో మార్పులు, సంస్కరణలు చేయాలంటే తప్పనిసరిగా రాష్ట్రప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంత యంత్రాంగం దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. పోలీసింగ్ వ్యవస్థ ఆధునికీకరణకు, సంస్కరణలు చేపట్టేందుకు రాష్ట్రాలకు కేంద్రం కూడా ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందజేస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- కాల్చేస్తున్నాం.. కూల్చలేకపోయారు!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
