close

తాజా వార్తలు

దాని వల్ల రెండు పార్టీలకు నష్టం

నాగ్‌పుర్‌: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా-శివసేన మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై ఇరు పార్టీలను ఉద్దేశించి ఆర్ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలం కలిసి కొనసాగిన ఆ రెండు పార్టీలు ఏ అంశంపై గొడవకు దిగినా రెండింటికీ నష్టమేనని వాటి పేర్లు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. నాగ్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘‘స్వార్థం అనేది మంచిది కాదని అందరికీ తెలుసు. కానీ అతి కొద్ది మంది మాత్రమే నిస్వార్థంగా ఉంటారు. ఒకే విషయమై వారివురు గొడవపడినట్లయితే ఇద్దరూ ఓటమి చెందాల్సి ఉటుంది’’ అని పరోక్షంగా భాజపా-శివసేనను ఉద్దేశించి అన్నారు.  

మహారాష్ట్రలో సీఎం పీఠం పంచుకోవడం గురించి శివసేన విధించిన షరతులకు భాజపా అంగీకారం తెలపకపోవడంతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమితో కలిసి శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేకపోవడంతో రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫారసు చేశారు. దీంతో ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. తాజాగా ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమితో కలిసి శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.   


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.