close

తాజా వార్తలు

విపత్తులో సాయానికి విద్యార్థుల డ్రోన్‌

దిల్లీ : విపత్తు నిర్వహణలో సహాయపడే సరికొత్త డ్రోన్‌ను ఐఐటీ-కాన్పూర్‌ విద్యార్థులు సొంతంగా తయారు చేశారు. డ్రోన్‌ పనితీరుకు సంబంధించిన వీడియోను కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్ నిశాంక్‌ ట్విటర్లో షేర్‌ చేస్తూ విద్యార్థులను అభినందించారు. హెలికాప్టర్‌ ఆకారంలో ఉన్న ఈ డ్రోన్‌కు ఇంకా పేరు పెట్టలేదు. ప్రకృతి విపత్తులు తలెత్తినపుడు ఈ డ్రోన్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రమంత్రి పోఖ్రియాల్ పేర్కొన్నారు. ‘కాన్పూర్‌ ఐఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు కలిసి అల్ట్రా మోడరన్‌ డ్రోన్‌ను తయారు చేశారు. కొద్దిరోజుల క్రితం క్యాంపస్‌కు వెళ్లినపుడు ఈ డ్రోన్‌ చూశాను. ఈ ఆవిష్కరణ ప్రకృతి విపత్తులు సంభవించినపుడు, దేశ అంతర్గత భద్రత పర్యవేక్షణలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని తయారీలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపున్నానని’ ఆయన ట్వీట్‌ చేశారు. 

ఈ డ్రోన్‌ తయారీకి సంబంధించి ఐఐటీ ప్రొఫెసర్లు డా.అభిషేక్‌, డా.మంగళ్‌ కొఠారీ మాట్లాడుతూ అంతర్గతంగా ఇంధనాన్ని మండించే ఇంజిన్‌ ఉన్న ఈ డ్రోన్‌కు నాలుగు నుంచి అయిదు కిలోల పేలోడ్ సామర్థ్యముందని చెప్పారు. గాలిలో నిరంతరాయంగా 3గంటలపాటు చక్కర్లు కొట్టగలదని వివరించారు. విపత్తు సంభవించిన ప్రాంతాల్లో బాధితులకు సహాయక సామాగ్రిని అందించేందుకు ఈ డ్రోన్‌ దోహదపడుతుందన్నారు. చిన్నపాటి శిక్షణతోనే దీన్ని సులభంగా నియంత్రించగలరని పేర్కొన్నారు. 

 డ్రోన్‌ మొత్తం విడిభాగాలు విద్యార్థులే సొంతంగా ల్యాబ్‌లో తయారు చేశారు. పోఖ్రాన్‌, లద్దాఖ్‌లలోనూ విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ డ్రోన్‌ సమర్థవంతమైన పనితీరు కనబరిచింది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో అంత్యంత వేగంగా వెళ్లేందుకు డ్రోన్‌లో మరిన్ని మార్పులు చేస్తున్నామని డా. కొఠారి చెప్పారు. సైనిక బలగాలు కూడా ఈ డ్రోన్‌ పనితీరును ప్రశంసించారని ఆయన వెల్లడించారు.

 

 

 

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.