
తాజా వార్తలు
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ స్పీకర్ ఎన్ఎన్ పాత్రోకు మంగళవారం విచిత్రమైన అనుభవం ఎదురైంది. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినిపతి తన నియోజవర్గ సమస్యలపై ప్రసంగిస్తుండగా.. ఆయన్ను స్పీకర్ పాత్రో ప్రశంసించారు. దీనికి స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గాల్లోకి ముద్దులు(ఫ్లయింగ్ కిస్‌లు)విసిరారు. ఆ ఎమ్మెల్యే చేసిన పనికి అందరూ నవ్వడం ప్రారంభించారు. దీనిపై కొందరు ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తారా ప్రసాద్ వివరణ ఇచ్చారు. స్పీకర్‌ను కించపర్చలేదని తెలిపారు. తమ సమస్యలకు సానుకూలంగా స్పందించినందుకే అలా చేసినట్లు తెలిపారు.
‘స్పీకర్ పాత్రోకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకున్నాను. ఆయనను అభినందించడానికి గుర్తుగా ఫ్లయింగ్ కిస్ పంపాను. మా నియోజవర్గంలో వెనకబడిన ప్రాంతాల ప్రజల సమస్యలను చెప్పగానే ఆయన సానుకూలంగా స్పందించారు. 147 మంది ఎమ్మెల్యేల్లో నాకు కూడా మాట్లాడటానికి సమయం ఇచ్చినందుకు నేను ఆ విధంగా కృతజ్ఞత తెలిపాను’ అని తారా ప్రసాద్ తెలిపారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
