close

తాజా వార్తలు

గూగుల్‌ పోటీలో వాయుసేన వీడియోగేమ్‌

దిల్లీ: భారత వాయుసేనకు చెందిన వీడియోగేమ్‌ ‘ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌: ఏ కట్‌ ఎబౌ’ ప్రతిష్ఠాత్మక గూగుల్‌ ఉత్తమ గేమ్స్‌ పోటీకి ఎంపికైంది. 2019 సంవత్సరానికి గానూ ‘బెస్ట్‌ గేమ్‌’ పోటీలో యూజర్స్‌ ఛాయిస్‌ గేమ్‌ కేటగిరీలో ఐఏఎఫ్‌ వీడియో గేమ్‌ను గూగుల్‌ ఎంపికచేసింది. ఈ విషయాన్ని ట్విటర్‌లో భారత వాయుసేన వెల్లడించింది. ఐఏఎఫ్‌ మొబైల్‌ వీడియో గేమ్‌కు ఓట్‌ వేయాలని కోరింది. 

వాయుసేనపై యువతలో అవగాహన కల్పించేందుకు, వారిని ఐఏఎఫ్‌లో చేరేలా ప్రోత్సహించేందుకు ఇటీవల వాయుసేన ఈ మొబైల్‌ వీడియో గేమ్‌ను విడుదల చేసింది. మల్టీప్లేయర్‌ వెర్షన్‌లో తీసుకొచ్చిన ఈ గేమ్‌లో పాక్‌ చెర నుంచి సురక్షితంగా బయటపడిన భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాత్ర కూడా ఉంది. తేజస్‌, రఫేల్‌, మిరాజ్‌-2000, సు-30 వంటి యుద్ధవిమానాలతో ఆడుతూ స్వయంగా శత్రు విమానాలపై దాడి చేసిన అనుభూతి పొందేలా ఈ గేమ్‌ను రూపొందించారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వెర్షన్లలో ఈ వీడియోగేమ్‌ అందుబాటులో ఉంది. 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.