close

తాజా వార్తలు

శబరిమలకు కొత్త చట్టం చేయండి: సుప్రీం

దిల్లీ: శబరిమల ఆలయ నిర్వహణకు కొత్త చట్టం రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జనవరి మూడో వారంలోపు కొత్త చట్టం తీసుకురావాలని కేరళ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కేరళలోని ఇతర ఆలయాలతో కలిపి చట్టం తీసుకురావడం సమంజసం కాదని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పండలం రాజ కుటుంబం వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.  

అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన సమీక్ష పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు విచారించిన విషయం తెలిసిందే. ఆలయంలోకి మహిళల ప్రవేశం సహా ఇతర మతపరమైన అంశాలను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం పరిశీలిస్తుందని గత గురువారం సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ వ్యవహారాన్ని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, గతంలో ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే విధించలేదు. అయినప్పటికీ భద్రతా కారణాలరీత్యా 10-50ఏళ్ల లోపు మహిళలను అనుమతించకుండా కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

వార్షిక మండల పూజల నిమిత్తం గత శనివారం శబరిమల ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అయ్యప్ప దర్శనానికి పలువురు 10-50ఏళ్ల లోపు మహిళలు రాగా.. వయసు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన పోలీసులు వారిని వెనక్కి పంపారు. మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఓ 12ఏళ్ల బాలికను పంబ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.