
తాజా వార్తలు
బెంగళూరు: సాంకేతిక విజ్ఞానం, విభిన్నమైన పరిశ్రమలు విస్తరిస్తున్న నేపథ్యంలో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా సమానంగా పరుగులు పెడుతున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే ఐటీ రంగంలో మహిళలు రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేస్తుండగా.. ఇతర రంగాల్లోనూ వారు రాత్రి వేళల్లో పనిచేసేలా కర్ణాటక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి రంగంతో పాటు ఇతర పరిశ్రమల్లో కూడా మహిళలు ఇకపై రాత్రిపూట (రాత్రి 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకు) పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫ్యాక్టరీల చట్టం - 1948 చట్టంలోని సెక్షన్ 66(1)(b)సెక్షన్ ప్రకారం మహిళలు రాత్రిపూట పనిచేయడం నిషిద్ధం. అయితే, దీన్ని మద్రాస్ హైకోర్టు కొట్టివేస్తూ గతంలో ఇచ్చిన తీర్పును కర్ణాటకలోని యడియూరప్ప సర్కార్ ఉటంకించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ తాజా నోటిఫికేషన్తో ఉత్పత్తి రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ మహిళలు రాత్రిపూట పనిచేసే అవకాశం కలగనుంది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్కౌంటర్పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఎన్కౌంటర్తో న్యాయం జరగలేదు
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- వారంలో ఖతం
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
