
తాజా వార్తలు
ఇంటర్నెట్డెస్క్: ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి ఎంతో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహ వేడుకను పదిమందీ గుర్తుంచుకునేలా ఆడంబరంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కొందరు. అలా పెళ్లి మండపానికి గుర్రంపైనో, లగ్జరీ కార్లలోనో రావడం చూసే ఉంటాం. కానీ ఓ వధువు వినూత్నంగా ఉండాలని ఏకంగా శవపేటికలో పెళ్లి మండపానికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరచింది. ఎప్పడు, ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముందుగా శవ పేటికపై కప్పి ఉంచిన నల్లటి వస్త్రాన్ని తొలగించారు. పెళ్లికి వచ్చిన అతిథులు చప్పట్ల మధ్య శవ పేటిక మూత తెరిచారు. అందులోంచి బంగారు రంగు గౌను ధరించిన వధువు నవ్వుతూ సంతోషంతో లేవడం చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యంతో చప్పట్లు కొడుతూ ఆమెకి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్కౌంటర్పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- దిశ తల్లిదండ్రులకు ఎన్హెచ్ఆర్సీ పిలుపు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
