close

తాజా వార్తలు

బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకి అడ్డంకులు..?

ముంబయి: ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘బుల్లెట్‌ రైలు’ ప్రాజెక్టుకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్రలో కాంగ్రెస్‌-ఎన్సీపీ, శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ప్రాజెక్టుని పక్కనబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు పక్షాలు కలిసి సిద్ధం చేసిన కనీస ఉమ్మడి ప్రణాళికలో దీన్ని చేర్చలేదని పేరుచెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్‌, ఎన్సీపీ నాయకులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన మొత్తాన్ని రైతుల సంక్షేమానికి కేటాయించాలని ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇటీవల సాగిన చర్చల్లో నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ విషయాన్ని కేంద్రానికి తెలియజేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఇదే జరిగితే ప్రాజెక్టు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగాలంటే కేంద్ర ప్రభుత్వమే పూర్తి వ్యయాన్ని భరించాల్సిన అవసరం ఏర్పడవచ్చు.

అహ్మదాబాద్‌-ముంబయి మధ్య నడిచే ఈ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వివిధ రకాల పనులకు బిడ్లు కూడా ఆహ్వానించారు. 48శాతం భూసేకరణ కూడా పూర్తయింది. 2023కల్లా దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకయ్యే వ్యయాన్ని రూ.1.08లక్షల కోట్లుగా అంచనా వేశారు. దీనిలో మహారాష్ట్ర తన వాటాగా రూ.5వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ వచ్చే ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లించనట్లయితే ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేయాలంటే కేంద్ర ప్రభుత్వమే ఆ భారాన్ని మోయక తప్పదు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.