close

తాజా వార్తలు

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

ముంబయి: మహారాష్ట్రలో రాత్రికి రాత్రే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.  అక్కడ విధించిన రాష్ట్రపతి పాలనను కేంద్రం ఈ తెల్లవారుజామున ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత ఫడణవీస్‌ నేతృత్వంలో  కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ పరిణామాలన్నీ వెనువెంటనే చోటుచేసుకున్నాయి. రాజకీయ పండితుల్ని సైతం ఆశ్చర్యపరిచాయి.

ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడంతో గవర్నర్‌ సిఫారసుల మేరకు ఈ నెల 12న రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. తాజాగా అనూహ్యంగా భాజపా-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో రాష్ట్రపతి పాలనని ఎత్తివేశారు. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం చేయగా.. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.