close

తాజా వార్తలు

శరణార్థి కాలనీలను క్రమబద్దీకరిస్తాం: మమతా

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు.  కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఉంటున్న శరణార్థుల కాలనీలను క్రమబద్ధీకరణ చేస్తామని ప్రకటించారు. దేశమంతటా జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) అమలు చేస్తామని కేంద్ర ప్రకటించిన తర్వాత ఆమె ఈ ప్రకటన చేయడం గమనార్హం. వలస వచ్చిన వారందరికీ టీఎంసీ ప్రభుత్వం భూమి హక్కు కల్పిస్తుందని ఆమె తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ భూముల్లో ఉంటున్న 94 శరణార్థి కాలనీలను క్రమబద్ధీకరణ చేసిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వాముల భూములపై కూడా చాలా శరణార్థి కాలనీలు ఉన్నాయి. వీటిని కూడా క్రమబద్ధీకరించాలని తాము చాలాకాలంగా చెబుతున్నాం. అయినప్పటికీ వారు తొలగింపు నోటీసులు పంపారని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీ(జాతీయ పౌర రిజిస్టర్‌)ని దేశవ్యాప్తంగా చేపడతాం అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన వెంటనే మమతా స్పందిస్తూ.. పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీని అనుమతించబోమని పేర్కొన్నారు. అంతేకాకుండా మళ్లీ కేంద్ర ప్రభుత్వ స్థలాల్లో ఉన్న కాలనీలను సైతం క్రమబద్ధీకరిస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. మరోవైపు బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులను టీఎంసీ ఓటు బ్యాంకుగా మలచుకుని రక్షిస్తోంది. దీనిపై భాజపా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.