close

తాజా వార్తలు

దురుద్దేశంతోనే శాస్త్రిపై ట్రోలింగ్‌: కోహ్లీ

దిల్లీ: టీమిండియా కోచ్‌ రవిశాస్త్రిపై దురుద్దేశపూర్వకంగానే ట్రోలింగ్‌ చేస్తున్నారని సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. సారథి చెప్పిన ప్రతి మాటకు ఆయన తలూపుతాడనే దృక్పథం తప్పని పేర్కొన్నాడు. పదో స్థానంలో జట్టులోకి వచ్చి ఓపెనర్‌గా 41 సగటు సాధించిన వ్యక్తిని విమర్శించాలంటే ఆ స్థాయిలో కష్టపడ్డవాళ్లే అయ్యుండాలన్నాడు.

‘ఇవన్నీ దురుద్దేశంతోనే చేస్తున్నారు. ఎవరు, ఎందుకు, ఏం ఆశించి చేస్తున్నారో నాకు తెలీదు. ఆ అవాస్తవాలను చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టే కనిపిస్తోంది. అదృష్టవశాత్తు రవిభాయ్‌ ఇలాంటివి పట్టించుకొనే వ్యక్తికాదు’ అని కోహ్లీ అన్నాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా జట్టులోకి అడుగుపెట్టిన శాస్త్రి వేగంగా ఎదిగాడు. ఓపెనర్‌గా 41 సగటు సాధించాడు. 1985 వరల్డ్‌ సిరీస్‌ క్రికెట్‌లో ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛాంపియన్స్’ పురస్కారం అందుకున్న సంగతిని కోహ్లీ గుర్తుచేశాడు.

‘శాస్త్రి పదో స్థానం నుంచి ఓపెనింగ్‌ చేశాడు. సగటు 41 సాధించాడు. ఇంటివద్ద కూర్చొని ట్రోలింగ్‌ చేసేవాళ్లని ఆయన పట్టించుకోడు. అలాంటి వ్యక్తిని ట్రోల్‌ చేయాలనుకుంటే లేచి, బౌలర్లను ఎదుర్కొని, ఆయన సాధించిన ఘనతలు సాధించండి. అవి చేసేందుకు ధైర్యం చేయండి. ఆ తర్వాత ఆయనతో వాదించండి. రవిశాస్త్రి చాలా సరదాగా ఉంటారు. ఎప్పటికీ అత్యుత్తమ జట్టుగా నిలవడమే మా లక్ష్యంగా చెప్పాడు. అలాంటప్పుడు బయట విషయాలు పట్టించుకోం’ అని కోహ్లీ అన్నాడు.

టీమిండియా పేసర్లు అద్భుతంగా రాణిస్తున్నారని కోహ్లీ పేర్కొన్నాడు. ఎవరికీ ఈర్ష్య లేకపోవడం వారి ప్రధాన బలమన్నాడు. షమిది ఏడో ర్యాంకా, బుమ్రాది 1వ ర్యాంకా, ఇషాంత్‌ ఏ ర్యాంకులో ఉన్నాడో చూడరన్నాడు. ప్రముఖ ఫుట్‌బాలర్‌ క్రిస్టియన్‌ రొనాల్డొ ఆత్మబలం, తిరిగి పుంజుకోవాలన్న కసి తనకు ఇష్టమని విరాట్‌ తెలిపాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.