close

తాజా వార్తలు

కోహ్లీలా కష్టపడితేనే ఫలితాలు: విండీస్‌ కోచ్‌

ముంబయి: లక్ష్యాలను సాధించాలంటే విరాట్‌ కోహ్లీలా కష్టపడాలని విండీస్‌ సహాయ కోచ్‌ రోడీ ఎస్ట్‌విక్‌ అన్నాడు. టీమిండియా సారథి అన్నింటికీ ఒక ‘గీటురాయి’గా మారాడని ప్రశంసించాడు. యువ ఆటగాళ్లు షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, నికోలస్‌ పూరన్‌, షై హోప్‌ అతడి నుంచి నేర్చుకోవాలని సూచించాడు.

‘యువ ఆటగాళ్లను చూస్తుంటే ఉత్సాహంగా ఉంది. వారిప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. కష్టపడేందుకు ఎంత సంసిద్ధంగా ఉన్నారన్నదే ఇక్కడ కీలకం. కోహ్లీ రూపంలో మనకో గీటురాయి ఉంది. అతనెప్పుడు జిమ్‌లో కష్టపడుతూనే ఉంటాడు. అతడిని చూసి ఎంతో నేర్చుకోవచ్చు. కష్టపడకుండా ఫలితాలు రావు. కష్టపడటం బోరింగ్‌ అనిపిస్తుంది కానీ, విజయాలు రావాలంటే తప్పదు మరి. ఒక్కసారి ఈ ప్రక్రియకు అలవాటు పడితే వారికి అవకాశం దొరుకుతుంది’ అని ఎస్ట్‌విక్‌ అన్నాడు.

‘ఈ పర్యటనలో ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. వారిని తప్పుపట్టలేం. నిజంగా కష్టపడ్డారు. ఫలితాలు రావడం వారు చూశారు. టీ20ల్లో హెట్‌ మైయిర్‌ ఆట ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు ఫార్మాట్‌ మారింది. చిన్నవయసులోనే అతడు వన్డేల్లో 4 శతకాలు సాధించాడన్నది మర్చిపోవద్దు. అతడిలో చాలా ప్రతిభ ఉంది. టీ20ల్లో మా ఆట సంతృప్తికరంగా ఉంది. కరీబియన్‌ దీవుల్లో ఇంతకుముందు తలపడ్డప్పుడు రెండు జట్ల మధ్య అంతరం చాలా ఉంది. ఇప్పుడు దాన్ని మా ఆటగాళ్లు తగ్గించారు. యువ స్పిన్నర్లు హెడేన్‌ వాల్ష్‌ జూనియర్‌, పియరీ, రోస్టన్ ఛేజ్‌ నేర్చుకొనేందుకు ఇదో మంచి అవకాశం. 2023కు వారిని సిద్ధం చేయడమే మా లక్ష్యం. రొమారియో షెఫర్డ్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగానికి అదనపు విలువ తెస్తాడు’ రోడీ తెలిపాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.