close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 31/12/2018 22:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫిట్స్‌కు శాశ్వత పరిష్కారముందా?

ఫిట్స్‌కు శాశ్వత పరిష్కారముందా?

సమస్య: నాకు 8 నెలల వయసులో మొదటిసారి ఫిట్స్‌ వచ్చాయి. తిరిగి 16 ఏళ్ల వయసులో కనిపించాయి. ఐదేళ్ల వరకూ మందులు వాడాను. తర్వాత బాగానే ఉంది. కానీ 36 ఏళ్ల వయసులో మళ్లీ ఫిట్స్‌ రావటంతో డాక్టర్లు రెండు రకాల మందులు ఇచ్చారు. మూడేళ్ల క్రితం మళ్లీ ఫిట్స్‌ వచ్చినపుడు మందులు, మోతాదులు మార్చారు. ఇటీవల తిరిగి రెండు సార్లు ఫిట్స్‌ వచ్చాయి. ఇలా మందుల మోతాదులు మార్చటం ఇబ్బందిగా అనిపిస్తోంది. నా సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఉందా?                            - జి.ఎస్‌. అమర ప్రసాద్‌, చిత్తూరు,

ఫిట్స్‌కు శాశ్వత పరిష్కారముందా?సలహా: మీరు చిన్నప్పుడు ఫిట్స్‌ వచ్చి ఆగిపోయి.. మళ్లీ మొదలయ్యాయని చెబుతున్నారు. మందులు వాడుతున్నా మధ్యమధ్యలో వస్తున్నాయని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే మీరు రిఫ్రాక్టరీ సీజర్స్‌తో బాధపడుతున్నారని అనిపిస్తోంది. సరైన మందులను, సరైన మోతాదులో వాడుకుంటున్నా సుమారు 30% మందిలో ఇలాంటి ఫిట్స్‌ కనబడుతుంటాయి. ఇవి తగ్గకుండా వేధిస్తుంటాయి. వీటిని సర్జరీ ద్వారా నయం చేయటానికి ప్రయత్నించొచ్చు. మెదడులో ఒక చోటు నుంచి ఫిట్‌ వస్తున్నవారికి (ఫోకల్‌ సీజర్స్‌) ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల ఫిట్‌ ఎక్కడ్నుంచి మొదలవుతోందనేది గుర్తించటం చాలా కీలకం. ఇందుకు వీఈఈజీ, ఎంఆర్‌ఐ పరీక్షలు బాగా ఉపయోగపడతాయి. అవసరమైతే పెట్‌ స్కాన్‌ కూడా చేయాల్సి ఉంటుంది. వీఈఈజీ, ఎంఆర్‌ఐ పరీక్షలు రెండింటిలోనూ ఫిట్‌ ఒకే దగ్గర్నుంచి వస్తున్నట్టు తేలితే సర్జరీ చేయటానికి అవకాశముంటుంది. ఇందులో ఫిట్‌ వస్తున్న భాగం నుంచి వెలువడే సంకేతాలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా అనుసంధానాలను కత్తిరిస్తారు. మాట, చూపు, వినికిడి వంటి ముఖ్యమైన పనులకు తోడ్పడే భాగాలకు ఫిట్‌ మొదలయ్యే ప్రాంతం దూరంగా ఉంటే మెదడులో ఆ భాగాన్ని కూడా తొలగించొచ్చు. అయితే సర్జరీ తర్వాత కూడా కొంతకాలం మందులు వేసుకోవాల్సి ఉంటుంది. దీంతో 70-80% మందికి ఫిట్స్‌ నయమయ్యే అవకాశముంది. కాబట్టి మీరు నిపుణులైన న్యూరాలజిస్ట్‌ను సంప్రతించటం మంచిది. మీరు సరైన మందులను వాడుతున్నారా? సరైన మోతాదులో వాడుతున్నారా? అయినా కూడా ఫిట్స్‌ వస్తున్నాయా? అనేది పరిశీలిస్తారు. ఒకవేళ మొండి ఫిట్స్‌గా నిర్ధరిస్తే.. తగు పరీక్షలు చేసి సర్జరీ చేయటానికి అనువుగా ఉన్నారో లేరో అనేది తేలుస్తారు.
మా చిరునామా : సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం,
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email: sukhi@eenadu.in


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.