close

తాజా వార్తలు

మధుమేహంపై కన్నే‘సి’ ఉంచుతుంది 

విటమిన్‌ సప్లిమెంట్లతో చక్కెర స్థాయి, బీపీ తగ్గుతుంది

మెల్‌బోర్న్‌: సి విటమిన్‌ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు జరుగుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఇవి రక్తంలో పెరిగిన చక్కెర స్థాయిని రోజంతా తగ్గిస్తాయని వారు వివరించారు. టైప్‌-2 మధుమేహం ఉన్నవారిలో రక్తపోటును కూడా అదుపు చేస్తుందని తెలిపారు. దీనివల్ల గుండె ఆరోగ్యానికీ ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆస్ట్రేలియాలోని డీకిన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన గ్లెన్‌ వాడ్లీ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. అధ్యయనంలో భాగంగా పరీక్షార్థులకు సాధారణంగా ఆహారంలో తీసుకునే సి విటమిన్‌ కన్నా 10 రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఇచ్చారు. వీరిలో భోజనానంతరం రక్తంలో చక్కెర స్థాయి వృద్ధిలో 36 శాతం మేర తగ్గిందని గుర్తించారు. దీన్నిబట్టి రోజులో దాదాపు 3 గంటల పాటు హైపర్‌గ్లైసేమియా (రక్తంలో ఎక్కువ మోతాదులో చక్కెర) స్థితి నుంచి తప్పించుకున్నట్లవుతుందని వాడ్లీ చెప్పారు. సి విటమిన్‌ మాత్రలు తీసుకున్న తర్వాత అధికరక్తపోటు ఉన్నవారి సంఖ్య సగానికి తగ్గిపోయిందని వివరించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.