Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 94929
            [news_title_telugu_html] => 

చల్లగా ఉందామా..!

[news_title_telugu] => చల్లగా ఉందామా..! [news_title_english] => Precautions in the summer [news_short_description] => మండే ఎండల వేళ కొన్ని పండ్లు, కూరగాయలు మనకు ఎంతో మేలు చేస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. వీటితో అధిక వేడి నుంచి ఉపశమనం దొరికి చల్లగా ఉండవచ్చంటున్నారు. .. [news_tags_keywords] =>  Precautions,summer,health [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-07 09:11:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చల్లగా ఉందామా..! - Precautions in the summer - EENADU
close

తాజా వార్తలు

చల్లగా ఉందామా..!

తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు

హబ్సిగూడ: మండే ఎండల వేళ కొన్ని పండ్లు, కూరగాయలు మనకు ఎంతో మేలు చేస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. వీటితో అధిక వేడి నుంచి ఉపశమనం దొరికి చల్లగా ఉండవచ్చంటున్నారు. ఈ కాలంలో దాహం ఎక్కువగా ఉండి, ఆకలి తక్కువగా ఉంటుంది. చాలామందికి జీర్ణక్రియ సరిగా ఉండదు. తిన్న ఆహారం జీర్ణం కాక ఇబ్బందిపడతారు.  తేలికపాటి ఆహారం, పండ్ల రసాలు, అధికంగా నీరు తాగడం వంటివి మేలు చేస్తాయి. ముఖ్యంగా కీర, నిమ్మ, పుచ్చకాయ, అల్లం, పుదీనా రసాలతో కూడిన చల్లటి పానీయాలు హాయినిస్తాయి. శొంఠి, మిరియాల చూర్ణంతో మజ్జిగ తీసుకుంటే కఫం నియంత్రణలోకి వస్తుంది. పటిక బెల్లంతో కలిపి మజ్జిగ తాగితే పైత్యం తగ్గుతుంది.

తక్షణ శక్తికి కొబ్బరి, పుచ్చకాయ
ఈ కాలంలో అత్యంత ఉపయోగకరమైన ద్రవ పదార్థం కొబ్బరినీళ్లు. వీటితో శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. గ్యాస్ట్రిక్‌ సమస్య, అల్సర్‌, చెడు కొలెస్ట్రాల్‌ వంటివి నియంత్రణలోకి వస్తాయి. కొబ్బరి నీటిలో పొటాషియం 600 మి.గ్రా, సోడియం 252మి.గ్రా., సి విటమిన్‌ 5.8మి గ్రా. ఉంటాయి. ఇక పుచ్చకాయలో ప్రధానంగా బి విటమిన్‌, పొటాషియం పుష్కలం. శరీరానికి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. వడదెబ్బ రాకుండా కాపాడుతుంది. కాలిన చర్మానికి పుచ్చకాయ గుజ్జు రాస్తే ఉపయుక్తం. ముదురు ఎరుపు రంగులో ఉండే పుచ్చలో కెరోటినాయిడ్స్‌, బీటా కెరోటిన్లు అధికం. ఎ, బి6, సి విటమిన్లు, పీచు సరేసరి. ఆమ్లాలను, వ్యర్థ పదార్థాలను శరీరంలో తగ్గించి కాల్షియం నిల్వలను పెంచి కీళ్ల నొప్పులను నియంత్రిస్తుంది. మూత్రంలో యూరిక్‌ ఆమ్లాన్ని తగ్గిస్తుంది. పుచ్చలో నీటిశాతం ఎక్కువ. ఇనుము 1.4గ్రా., కాల్షియం 32మి గ్రా., శక్తి 17కిలో క్యాలరీలు ఉంటాయి. అలానే ఉదయాన్నే వేడి నీటిలో నిమ్మరసం, కాస్త తేనె కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

కడిగి తినాల్సిందే
పండ్లను శుభ్రంగా కడిగి తినడం, జ్యూస్‌ చేసుకొని తాగితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తద్వారా రక్తప్రసరణ మెరుగవుతుంది. అజీర్తి, మలబద్దకం, గొంతు వాపు రాకుండా ఉంటాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.