Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 95412
            [news_title_telugu_html] => 

ధనియాల నీరు..మోదుగు పూల తేనీరు

[news_title_telugu] => ధనియాల నీరు..మోదుగు పూల తేనీరు [news_title_english] => health tips [news_short_description] => నగరంలో ఎండలు మండుతున్నాయి. 40..41..42 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడు సెగలు కక్కుతున్నాడు. ఎండవేళ తప్పనిసరైతేనే బయటకు ... [news_tags_keywords] => health,summer [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-08 07:01:34 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ధనియాల నీరు..మోదుగు పూల తేనీరు - health tips - EENADU
close

తాజా వార్తలు

ధనియాల నీరు..మోదుగు పూల తేనీరు

వేసవి తాపం నుంచి బయటపడే చిట్కాలు

హైదరాబాద్‌: నగరంలో ఎండలు మండుతున్నాయి. 40..41..42 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడు సెగలు కక్కుతున్నాడు. ఎండవేళ తప్పనిసరైతేనే బయటకు రావాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడు కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బయట దొరికే పండ్ల రసాలు, శీతల పానీయాలు, తాగునీటి పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలంటున్నారు. తీవ్రమైన ఎండలతో శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. కొద్దిపాటి సన్నద్ధతతో మే నెలలో పెరిగే వేసవి తీవ్రత నుంచి బయట పడవచ్చంటున్నారు. పోపుల దినుసులు.. సీజన్‌లో దొరికే పండ్లను తీసుకోవటం ద్వారా అధిక ఉష్ణోగ్రత బారి నుంచి బయటపడవచ్చని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ప్రొఫెసర్‌ డా.సునీతా జోషి సూచించారు.

ఇలా చేస్తే మేలు..
* చాలినంత నీటిని తీసుకోవాలి. నూనె పదార్ధాలకు దూరంగా ఉండాలి. తరచూ మజ్జిగ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా ఉంటుంది.
* ఎంత నీరు తీసుకున్నా చెమట రూపంలో బయటకు పోతుంది. శరీరంలో సరిపడా నీరు లేక మూత్ర సంబంధ సమస్యలు తలెత్తవచ్చు. అశ్రద్ధ చేస్తే ఫలితం తీవ్రంగా ఉంటుంది. దీన్నుంచి బయటపడేందుకు మోదుగు పూలు బాగా పనిచేస్తాయి. వేసవి ప్రారంభంలోనే ఇవి పూస్తాయి. హోలీ వేడుకల్లో దీని రంగులే అధికంగా ఉపయోగిస్తారు. చర్మవ్యాధులకు ఇదొక ఔషధం. ఈపూలను ఎండబెట్టి పొడిగా చేసి టీ మాదిరిగా చేసుకుని తాగాలి. దీంతో మూత్రంలో మంట తగ్గుతుంది.

పండు.. ఆరోగ్యం మెండు
* వేసవిలో లభించే పండ్లు ఆరోగ్యాన్ని, ఉపశమనాన్ని ఇస్తాయి. తాటిముంజలు ..వీటినే ఐస్‌ యాపిల్‌గా పిలుస్తారు. శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూస్తాయి. రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు సహకరిస్తాయి.
* కర్బూజలో అధికశాతం నీరు ఉంటుంది. ప్రొటీన్లు లభిస్తాయి. విటమిన్లు,ఖనిజలవణాలు బాగా ఉంటాయి.
* నేరేడు ఆయుర్వేదంలో ప్రాధాన్యం ఉన్న పండు. పీచుపదార్ధం, కాల్షియం, పొటాషియం, సోడియం పుష్కలం.
* పుచ్చకాయ తక్షణమే శక్తినిస్తుంది. పొటాషియం, నీరుశాతం అధికంగా ఉండటం వల్ల ఉత్సాహాన్నిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంచుతుంది.
* ఎన్ని పండ్లు తిన్నా మామిడిని ఆస్వాదించడంలో మజాయే వేరు. ఫలరాజుగా పేరున్న మామిడి కోసం ఏడాదిపాటు ఎదురు చూస్తుంటారు. మధుమేహులు మాత్రం మితంగా తీసుకోవాలి. కేలరీలు అధికంగా ఉండటం వల్ల ఊబకాయులు  కూడా పరిమితి పాటించాలి. పుష్కలమైన పీచు పదార్థాలతోపాటు విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌, మినరల్స్‌ బాగా లభిస్తాయి.
* ఏ పండు అయినా తినే ముందు కొద్దిసేపు ఉప్పునీటిలో ఉంచి తరువాత కడిగి తినడం ఉత్తమం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.