Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119677
            [news_title_telugu_html] => 

పర్యావరణ ప్రమాదానికి ఇది సంకేతమా?

[news_title_telugu] => పర్యావరణ ప్రమాదానికి ఇది సంకేతమా? [news_title_english] => Freak summer hailstorm buries cars in Mexicos Guadalajara [news_short_description] => మెక్సికో నగరానికి కొద్ది దూరంలో ఉన్న గ్వదలహారా పట్టణవాసులు ఆదివారం ఉదయం లేస్తూనే ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. వారి నివాసాల చుట్టూ కప్పి ఉన్న దట్టమైన వడగండ్ల దుప్పటిని.... [news_tags_keywords] => mexico,hailstorm,summer [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-01 19:47:39 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పర్యావరణ ప్రమాదానికి ఇది సంకేతమా? - Freak summer hailstorm buries cars in Mexicos Guadalajara - EENADU
close

తాజా వార్తలు

పర్యావరణ ప్రమాదానికి ఇది సంకేతమా?

మెక్సికో: మెక్సికో నగరానికి కొద్ది దూరంలో ఉన్న గ్వదలహారా పట్టణవాసులు ఆదివారం ఉదయం లేస్తూనే ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. వారి నివాసాల చుట్టూ కప్పి ఉన్న దట్టమైన వడగండ్ల దిబ్బలను చూసి ఆశ్చర్యపోయారు. ఎండాకాలం, అదీ 30డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ వడగండ్ల వర్షం కురవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ఇలాంటి వర్షాలు కురిసినప్పటికీ ఈ స్థాయిలో ఎప్పుడూ చూడలేదని. దాదాపు రెండు మీటర్ల ఎత్తు మేర వడగళ్లు పేరుకుపోయాయి. దీంతో కార్లు, ఇతర వాహనాలు దాదాపు సగం మేర కూరుకుపోయాయి. అవేవీ కదల్లేని పరిస్థితి నెలకొంది. ఈ నగరానికి చుట్టుపక్కల ఉన్న మరో ఆరు పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వాతావరణ మార్పులతో సమీప భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోబోతున్నామన్న పర్యావరణవేత్తల హెచ్చరికలకు ఇలాంటి విపత్తులే నిదర్శనమేమో అనిపించక మానదు.

మెక్సికోలోని జలిస్కో ప్రావిన్స్‌ రాజధానియే గ్వదలహారా. గతంలో ఇక్కడ అనేక సార్లు వడగళ్ల వర్షాలు కురిశాయి. అయితే ఈ స్థాయిలో రావడం మాత్రం ఇదే తొలిసారని ప్రావిన్స్‌ గవర్నర్‌ ఎన్రిక్ అల్ఫారో తెలిపారు. ‘బహుశా పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్న మార్పుల దుష్పరిణామాలు ఇవేనేమో’ అని వ్యాఖ్యానించారు. సహాయక సిబ్బంది ప్రధాన మార్గాలను శుభ్రపరచడంలో నిమగ్నమయ్యారని తెలిపారు. కాగా, ఇదంతా పర్యావరణ మార్పుల ప్రభావం అని తెలియని పసివారు వడగళ్లతో ఆడుకుంటున్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.