close

తాజా వార్తలు

Published : 17/10/2019 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అద్దం పట్టండి!

ఇస్లాం సందేశం

ద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోని వారెవరు? అది మన ముఖాన్ని అచ్చుగుద్దినట్లు ఉన్నది ఉన్నట్లు చూపెడుతుంది. ఉన్న లోపాలను యథాతథంగా చూపుతుంది. అది కింద పడి ముక్కలైనా ప్రతి ముక్కలోనూ నిజమే కనిపిస్తుంది తప్ప లేనిది కనిపించదు. అందుకే  ప్రవక్త (స) ‘‘ఒక విశ్వాసి మరో విశ్వాస సోదరునికి అద్దంలాంటివాడు.’’ అని అన్నారు.
సగటు ముస్లిం అద్దంలా ఎప్పుడూ సత్యమే పలకాలన్నది ప్రవక్త ఉద్బోధ. నిజాన్ని నిర్భీతిగా చెప్పాలి. మంచికి ప్రతిబింబంగా మారాలి. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాట్లాడటం విశ్వాసికి శోభించదు. చేదుగా అనిపించినా సత్యమే పలకాలని ప్రవక్త (స) బోధించారు. నిజం చెప్పడం వల్ల తొలుత కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా ఆ తరువాత మన వ్యక్తిత్వం వికసిస్తుంది. దానికి భిన్నంగా చీటికీమాటికీ అబద్ధాలు చెబుతూ తిరిగేవారి వ్యక్తిత్వానికి మాయని మచ్చ ఏర్పడుతుంది. అందుకే సత్యం పలకడాన్ని ఎట్టి పరిస్థితిల్లోనూ మానుకోకూడదు. అప్పుడు అల్లాహ్‌ వద్ద మన పేరు సత్యసంధుల జాబితాలో చేరుతుంది. అందుకే అబద్ధానికి ఆమడ దూరంలో ఉండండి అని బోధించారు ప్రవక్త.

- ఖైరున్నీసా బేగం


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని