close

తాజా వార్తలు

ఎత్తైన అలపై సర్ఫింగ్.. ఔరా అనిపించే సాహసం‌

ఎత్తైన అలపై సర్ఫింగ్.. ఔరా అనిపించే సాహసం‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సాధారణంగా సముద్రంలో వచ్చే ఎత్తైన అలలను చూస్తేనే ఒక్కోసారి భయమేస్తుంది. అటువంటి అలలను దాటుకొంటూ సర్ఫింగ్‌ చేయడమంటే మామూలు విషయం కాదు. అలాంటిది 68 అడుగుల ఎత్తైన అలపై సర్ఫింగ్‌ చేయడమంటే.. వామ్మో అనాల్సిందే! ఎంతో నేర్పు, అనుభవం ఉన్న సర్ఫర్లు కూడా ఒక్కోసారి ఈ సాహసాన్ని చేసేందుకు వెనుకాడతారు. అయితే.. ఓ మహిళ మాత్రం దాన్ని చేసి చూపించి అందురితో ఔరా..! ఏమి ఈ సాహసం అనిపించింది. ఆ సాహసమే ఇప్పుడు ఆమెకు ప్రపంచ రికార్డు తెచ్చిపెట్టింది. అంతేకాదు.. ఆమె ఎక్కడైతే సర్ఫింగ్‌ చేసి గాయపడిందో మళ్లీ అదే ప్రాంతంలో సర్ఫింగ్‌ చేసి ఈ రికార్డును సృష్టించడం విశేషం. ఆమె మరెవరో కాదు.. 31ఏళ్ల బ్రెజిలియన్‌ మహిళ మాయ గాబ్రియా.

ఈ ఏడాది జనవరిలో పోర్చుగల్‌ సముద్ర తీరంలో గాబ్రియా 68అడుగల ఎత్తైన అలపై సర్ఫింగ్‌ చేసింది. కానీ అప్పుడు ఆమెకు తెలియదు.. అదొక రికార్డు సృష్టించిందని. చాలా ఎత్తులో అల ముంచుకొస్తుంటే ఆమె ఎటువంటి భయం లేకుండా దానిపై అలవోకగా సర్ఫింగ్‌ చేసింది. ఆ అలపై ఆమె చేస్తున్న సర్ఫింగ్‌ చూస్తుంటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవాల్సిందే. నజారేలో జరిగిన వరల్డ్‌ సర్ఫ్‌ లీగ్‌లో పాల్గొన్న గాబ్రియా 68 అడుగుల ఎత్తైన అలపై ఈ సాహసాన్ని చేసి ఔరా అనిపించింది. 2013లో ఇదే ప్రాంతంలో గాబ్రియా సర్ఫింగ్‌ చేస్తూ ప్రమాదానికి గురైంది. అయితే.. ఇప్పుడు అదే ప్రాంతంలో ఆమె మళ్లీ సర్ఫింగ్‌ చేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. అత్యంత ఎత్తైన అలపై సర్ఫింగ్‌ చేసిన మహిళగా ఆమె నిలిచింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆమె పేరుపై ఈ రికార్డు నమోదైంది. దీనిపై గాబ్రియా తెగ సంతోషపడిపోతుంది.

ప్రపంచ రికార్డు సృష్టించాలనే నా కల చాలా ఏళ్ల నుంచి ఉంది. 2013లో సర్ఫింగ్‌ చేసే సమయంలో నేను ప్రమాదానికి గురయ్యాను. ఆ సమయంలో నా కల దూరమవుతుందేమోనని అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా నాకు ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే సర్ఫింగ్‌ చేసి రికార్డు సృష్టించాను’ అని చెబుతూ తెగ సంబరపడింది గాబ్రియా.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.