close

తాజా వార్తలు

మీ ఇల్లు స్మార్ట్‌గానూ!

మీ ఇల్లు స్మార్ట్‌గానూ!స్మార్ట్‌ హోం అంటే.. అదేదో ప్రత్యేకంగా నిర్మించే ఇల్లేం కాదు.. ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) పరికరాలతో ఉన్న ఇంటినీ స్మార్ట్‌గా మార్చేయొచ్చు.. అందుకు తగిన ఐఓటీ పరికరాలు చాలానే ఉన్నాయ్‌... మీ బడ్జెట్‌ మేరకు ఎంపిక చేసుకుంటే సరి!

ఏవో కొన్ని స్మార్ట్‌ బల్బ్‌లు.. వాటిని ఫోన్‌తో ఆపరేట్‌ చేయడం ఒక్కటే స్మార్ట్‌హోం అనుకునే రోజులు ఎప్పుడో. ఇప్పుడు అలా కాదు. మాట్లాడుతూనే ఇంట్లోని పరికరాల్ని ఆన్‌ లేదా ఆఫ్‌ చేస్తున్నారు. ఎలాగంటే.. అడిగితే పాటలు ప్లే అవుతున్నాయ్‌.. కోరితే ఏసీ ఆన్‌ అవుతుంది... ఆదేశిస్తే వాషింగ్‌ మెషీన్‌ పని మొదలుపెడుతుంది.. స్ట్రాంగ్‌ కాఫీ అంటే.. వేడి వేడి కాఫీ సిద్ధం అవుతుంది.. దూర ప్రాంతాలకు వెళ్లినా ఇంటి పరిసరాలపై ఓ కన్నేసి ఉంచొచ్చు. ఇదంతా అంతా బడ్జెట్‌ మేరకే ప్లాన్‌ చేసుకోవచ్చు. మార్కెట్‌లో అందుకు తగినవి చాలానే ఉన్నాయ్‌.

 

మీ ఇల్లు స్మార్ట్‌గానూ!

ఫిలిప్స్‌ కంపెనీ అందిస్తున్న Philips Hue Mini Starter కిట్‌తో ఇంట్లో  వెలుగుని స్మార్ట్‌గా మార్చేయొచ్చు. కిట్‌ ప్రారంభ ధర రూ.12,480. మూడు 10 వాట్‌ల బల్బ్‌లతో పాటు బుల్లి రౌటర్‌ ఉంటుంది. దాంతోనే బల్బులు నెట్‌కి అనుసంధానమై  వైర్‌లెస్‌గా పని చేస్తాయి. ఫోన్‌లో యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని  లైట్స్‌ ఆపరేట్‌ చేయొచ్చు. నిర్ణీత సమయానికి ఆన్‌ లేదా ఆఫ్‌ అయ్యేలా షెడ్యూల్‌ సెట్‌ చేసి పెట్టుకోవచ్చు. మీ మూడ్స్‌కి తగినట్టుగా వెలుతురు, రంగుల్లో మార్పులు చేయొచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్‌తో పని లేకుండా మాటలతోనే కంట్రోల్‌ చేయొచ్చు.

కుక్కర్‌, గీజర్‌, ఏసీ, ఇస్త్రీ పెట్టె... వాడేది ఏదైనా వాడుతున్న వై-ఫై నెట్‌వర్క్‌తో స్మార్ట్‌గా మార్చేందుకు OakterSmart home Kit పరికరాల్ని ప్రయత్నించొచ్చు. ధర రూ.14,450. పరికరాల్లో ‘హబ్‌’ రౌటర్‌లా పని చేస్తుంది. స్మార్ట్‌ ప్లగ్‌ల సామర్థ్యం మేరకు ఏసీలు, కుక్కర్‌లు, బల్బ్‌లు, దోమల నివారణకు వాడే రిపల్లెంట్‌ పరికరాల్ని కనెక్ట్‌ చేసి స్మార్ట్‌గా మార్చేయొచ్చు. ఫోన్‌తోనే కాకుండా వాయిస్‌ అసిస్టెంట్‌లతోనూ ప్లగ్‌లను నియంత్రించొచ్చు.

మీ ఇల్లు స్మార్ట్‌గానూ!

మీ ఇల్లు స్మార్ట్‌గానూ!

వంటగదిని స్మార్ట్‌గా మార్చేయాలంటే Nescafe E Connected మగ్‌ని పెట్టేస్తే సరి.  ధర రూ.6,499. బ్లూటూత్‌ నెట్‌వర్క్‌తో ఫోన్‌తో జతకట్టి పని చేస్తుంది. రుచికరమైన కాఫీ వేడివేడిగా తాగాలనుకుంటే ఫోన్‌ నుంచి ఆదేశిస్తే చాలు. క్షణాల్లో కాఫీ సిద్ధం అవుతుంది. 

మీ ఇల్లు స్మార్ట్‌గానూ!

ఇంట్లో నిత్యవసరంగా వాడే ఫ్రిడ్జ్‌ మాటేంటి? కుటుంబంతో మాటకలిపేలా ముందుకొచ్చింది శామ్‌సంగ్‌ Family Hub. ధర  సుమారు రూ.2,80,000. 21.5 అంగుళాల తాకేతెర, బిల్ట్‌ఇన్‌ మైక్రోఫోన్‌తో పని చేస్తుంది. ఫోన్‌తో అనుసంధానం అవుతుంది. ఏమేం నిండుకున్నాయో ఫోన్‌ ద్వారానే తెలుసుకుని ఆర్డర్‌ చేయొచ్చు. అమెజాన్‌ అలెక్సాతో జతకట్టి పని చేస్తుంది. అంటే.. ఫ్రిడ్జ్‌తో మాట్లాడొచ్చు. వంట చేస్తూ అడిగితే పాటల్ని ప్లే చేస్తుంది.

‘షామి’ లైట్లు

మీ ఇల్లు స్మార్ట్‌గానూ!

స్మార్ట్‌ ఫోన్లే కాదు. ఇకపై స్మార్ట్‌ లైట్లతో అలరించేందుకు సిద్ధం అయ్యింది చైనాకి చెందిన షామి సంస్థ. దేశీయ మార్కెట్‌లోకి Yeelight పేరుతో ప్రవేశపెట్టింది. విప్రో, ఫిలిప్స్‌ స్మార్ట్‌ బల్బ్‌ల మాదిరిగానే ఇంట్లో వై-ఫై నెట్‌వర్క్‌ని వాడుకుని పని చేస్తాయి. ప్రత్యేక యాప్‌తో ఫోన్‌తో జత కడతాయి. మూడ్‌కి అనుగుణంగా లైటు రంగుల్ని మార్చుకోవచ్చు. నిర్ణీత సమయానికి వెలిగేలా షెడ్యూల్‌ చేసుకునే వీలుంది. ఫోన్‌తోనే కాకుండా అమెజాన్‌ అలెక్సా, గూగుల్‌ అసిస్టెంట్‌తో వీటిని ఆపరేట్‌ చేయొచ్చు.

మీ ఇల్లు స్మార్ట్‌గానూ!

వాల్టాస్‌ కంపెనీ ఈ మధ్యే వై-ఫై నెట్‌వర్క్‌ పని చేసే ఏసీలను పరిచయం చేసింది. 3 Star Inverter Split AC. ధర రూ.34,999. ఫోన్‌తోనే కాకుండా అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ సపోర్టుతో పని చేస్తుంది. చల్లదనం ఎక్కువైనప్పుడు రిమోట్‌ లేదా ఫోన్‌ కోసం వెతుక్కోకుండానే ‘అలెక్సా.. స్వీచ్‌ఆఫ్‌’ అంటే చాలు. ఏసీ ఆఫ్‌ అవుతుంది. అంతేనా... ఆఫీస్‌ నుంచి వస్తూనే ఆన్‌ చేసి గదిని చల్లబరుచుకోవచ్చు.

ప్రయోజనాలు 
ఐఓటీ పరికరాలతో ఇంట్లోకి అడుగుపెట్టక ముందే విద్యుత్‌ దీపాలు వెలుగుతాయి. టీవీలో ఇష్టమైన ఛానల్‌ ప్రసారమవుతుంది. ఏసీ ఆన్‌ అవుతుంది. హీటర్‌ వేడి నీటిని సిద్ధంగా ఉంచుతుంది. నచ్చిన మ్యూజిక్‌ ఆల్బమ్‌ ప్లే అవుతుంది. మైక్రోఅవెన్‌లో ఆహారం వేడవుతుంది. ఇలా మరిన్ని...

అందుకు కావాల్సినవి 
స్మార్ట్‌ లైట్లు, ప్లగ్లు, స్పీకర్‌ అసిస్టెంట్లు, స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌

బడ్జెట్‌ పైబడి...

మీ ఇల్లు స్మార్ట్‌గానూ!

ఖరీదెంతైనా ఫర్వాలేదు అనుకుంటే.. ప్లగ్‌లు, సాకెట్‌లతో సంబంధం లేకుండా  బిల్ట్‌ఇన్‌గా ఐఓటీ శక్తిని నిక్షిప్తం చేసుకుని పని చేసే స్మార్ట్‌ పరికరాలు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. 
దూరప్రాంతాలకు వెళ్లినా ఇంటిపై ఓ కన్నేసి ఉంచేందుకు  Ezviz Mini O 1080p స్మార్ట్‌ కెమెరాని వాడొచ్చు. ధర రూ.4,299. వై-ఫై నెట్‌వర్క్‌ని వాడుకుని పని చేస్తుంది. ఎక్కడినుంచైనా 1080 పిక్సల్‌ క్వాలిటీతో వైడ్‌ యాంగిల్‌ లైవ్‌ వీడియోలు చూడొచ్చు. మోషన్‌ సెన్సర్‌తో ఏవైనా కదలికలు గుర్తిస్తే అలర్ట్‌ వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు అమెజాన్‌ అలెక్సాని పిలిస్తే చాలు.. కెమెరా కన్ను స్పందిస్తుంది.

రిమోట్‌తో పని లేకుండా టీవీ ముందు కూర్చుని మాట్లాడుతూనే మీకు ఇష్టమైన ఛానల్స్‌ని చూద్దాం అనుకుంటే Sony’s 43-inch Bravia KD-43X8200E 4K LED TV ఉంది. సోఫాలో హాయిగా పడుకుని వాయిస్‌ కమాండ్స్‌తోనే వాల్యూమ్‌ పెంచొచ్చు. అన్నింటికీ అమెజాన్‌ అలెక్సాని కోరడమే. తెర పరిమాణం 43 అంగుళాలు. ధర రూ.75,990.

మీ ఇల్లు స్మార్ట్‌గానూ!

మీ ఇల్లు స్మార్ట్‌గానూ!

ఇంటికెళ్లే సరికి ఇంటిని అద్దంలా మార్చేసే స్మార్ట్‌ వాక్యూమ్‌ క్లీనర్‌ ఒకటుంది. అదే iRobot Roomba 671. ధర రూ.29,000. వై-ఫై నెట్‌వర్క్‌ని వాడుకుని మీరు చెప్పిన సమయానికి రోజూ శుభ్రం చేస్తుంది.

ఐఓటీ పరికరాల్ని వాయిస్‌ కమాండ్స్‌తో కంట్రోల్‌ చేసేందుకు స్మార్ట్‌ స్పీకర్లని అపాయింట్‌ చేసుకోవచ్చు.

మీ ఇల్లు స్మార్ట్‌గానూ!

గూగుల్‌ హోం 
అడిగితే కావాల్సిన వీడియోలను టీవీలో ప్లే చేస్తుంది. కోరిన మ్యూజిక్‌.. సినిమాల్ని క్షణాల్లో తెరపైకి తెస్తుంది. హాల్లో కూర్చుని పడకగదిలో లైట్స్‌ని ఆఫ్‌ చేయమంటే చేస్తుంది.         ధర రూ.8,999

అమెజాన్‌ ఎకో ప్లస్‌ 
అలెక్సాతో ఆర్డర్‌ చేయడమే ఆలస్యం. ఇంట్లోని స్మార్ట్‌ గ్యాడ్జెట్‌లు అన్నీ చిత్తం అంటూ స్పందించాల్సిందే. ధర రూ.11,999

మీ ఇల్లు స్మార్ట్‌గానూ!

వై-ఫై నెట్‌వర్క్‌ని వాడుకుని పని చేసే  సాకెట్లూ ఉన్నాయ్‌.Smarteefi’s WiFi Smart Power Extension Strip అలాంటిదే. ధర రూ.2,799. దీంట్లోని మూడు సాకెట్లను స్మార్ట్‌గా వాడుకోవచ్చు. ఇంట్లో కూలర్‌ని సాకెట్‌కి కనెక్ట్‌ చేస్తే ఆఫీస్‌లో స్టార్ట్‌ అవుతున్నప్పుడే ఆన్‌ చేయొచ్చు. ఇంటికొచ్చేసరికి గది చల్లగా అయిపోతుంది. అమెజాన్‌ అలెక్సా, గూగుల్‌ హోం స్మార్ట్‌ స్పీకర్లతోనూ జతకట్టి పని చేస్తుంది.

మీ ఇల్లు స్మార్ట్‌గానూ!

గదిలోకి వెళ్లగానే ఆటోమాటిక్‌గా లైట్‌లు వెలగాలంటే? లేదా అనుమతి లేకుండా ఇతరులు ఎవరైనా మీ గదిలోకి ప్రవేశించినప్పుడు మీ కంట పడాలంటే? Philips 4100248U7 Hue Motion Sensor Smart పరికరాన్ని ప్రయత్నించొచ్చు. ధర రూ.7,890. వైర్లతో పని లేకుండా బ్యాటరీతో పని చేస్తుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.