close

తాజా వార్తలు

ష్‌!! గప్‌చుప్‌ యాప్‌ 

అమ్మానాన్నలకో ఆయుధం

ష్‌!! గప్‌చుప్‌ యాప్‌ 

స్మార్ట్‌ ఫోన్‌ పిల్లల చేతికందడం ఆలస్యం... పరిధుల్లేని ప్రపంచానికి పాస్‌పోర్టు దొరికినట్టే! తమ వయసుకి మించినవే యాక్సెస్‌  చేయాలని చూస్తారు. దీంతో నెట్టింటి వల సిద్ధంగా ఉంటుంది. బుట్టలో వేసుకోవడానికి! మరి, పిల్లలపై మీ నిఘా సంగతేంటి?

కప్పుడు కంప్యూటర్‌, ల్యాపీల్లో వెబ్‌సైట్‌లు.. ఇప్పుడన్నీ యాప్‌లే.  అందుకు ఆండ్రాయిడే ప్రధాన వేదిక. మరి, ఈ యాప్‌లు వాడే క్రమంలో ప్రకటనలు ప్రత్యక్షమవ్వడం సాధారణమే. అవే యాప్‌ నిర్వాహకులకు సిరులు కురిపిస్తాయి. అయితే, ఈ ప్రకటనలు పిల్లల రూటు మార్చేస్తున్నాయ్‌. టీనేజర్లు స్మార్ట్‌ ఫోన్‌, ట్యాబ్లెట్‌లకు బాగా దగ్గరవుతున్న నేపథ్యంలో.. యాప్‌ల్లో పుట్టుకొచ్చే ప్రకటనలు కొన్ని పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. వందకు పైనే యాప్‌లపై నిఘా పెట్టి చేసిన విశ్లేషణలో పలు ప్రకటనలు ఆన్‌లైన్‌ కొనుగోళ్ళు చేసేలా పిల్లలను ప్రేరేపిస్తున్నాయట. ముఖ్యంగా వీడియో గేమ్‌లకు సంబంధించిన ప్రకటనలతో ‘బై గేమింగ్‌ ప్యాక్‌’ అంటూ చిన్నారుల్ని ఊరిస్తున్నాయ్‌. ఎక్కువగా ఉచిత యాప్‌ల్లోనే ఈ తరహా ప్రకటనలు కనిపిస్తాయని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. పిల్లల యాక్టివిటీపై పెద్దవాళ్లు కన్నేయకుంటే ప్రకటనలతో ముప్పే అంటున్నారు. పెద్దల ఫోన్‌లనే పిల్లలు యాక్సెస్‌ చేస్తున్నట్టయితే... నెట్టింటికి అనుసంధానమై ఉన్న బ్యాంకింగ్‌ ఎకౌంట్‌లకు సెక్యూరిటీ సమస్యలూ ఎదురవ్వొచ్చు. పెద్దలూ... పారాహుషార్‌!!

ప్లే స్టోర్‌ ఇలా పదిలం

ష్‌!! గప్‌చుప్‌ యాప్‌ 

గూగుల్‌ ప్లేలో పలు రంగాలకు సరిపడే యాప్‌లు లెక్కకు మిక్కిలే ఉన్నాయి. వయసుల వారీగానూ వాటిని స్టోర్‌లో పొందుపరుస్తారు. గేమ్స్‌ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరైతే, హింసాత్మకమైన గేమ్స్‌ పిల్లల కంటపడకుండా.. వారికి తగినవి మాత్రమే యాక్సెస్‌ అయ్యేలా చేయాలంటే ‘పేరెంటల్‌ కంట్రోల్స్‌’ని ఎనేబుల్‌ చేయండి. దీంతో ఎలాంటి హానికరమైన యాప్‌లను పిల్లలు యాక్సెస్‌ చేసేందుకు వీలుండదు. హింసాత్మకమైన గేమ్‌లు, అడల్ట్‌ యాప్‌లను పిల్లలు యాక్సెస్‌ చేయకుండా పేరెంటల్‌ కంట్రోల్స్‌ అడ్డుకుంటాయి. ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేసేందుకు ఫోన్‌లో గూగుల్‌ ప్లే స్టోర్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. వచ్చిన మెనూల్లో పేరెంటల్‌ కంట్రోల్స్‌ డిసేబుల్‌ మోడ్‌లో ఉంటాయి. ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేయాలి. దీంతో యాప్‌లు, గేమ్స్‌, సినిమాలు, మ్యూజిక్‌.. ఇలా ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నవి అన్నీ ఫిల్టర్‌ అయ్యి కనిపిస్తాయి. ఆప్షన్‌ని తిరిగి డిసేబుల్‌ చేసేందుకు వీలు లేకుండా పిన్‌ నెంబర్‌ని సెట్‌ చేయొచ్చు. పిల్లల పుట్టిన రోజు తేదీలను పిన్‌ నెంబర్లుగా పెట్టొద్దు. మీకు గుర్తుండేలా మరేవైనా పెడితే మంచిది. పిల్లల వయసు ఆధారంగా యాప్‌లు, గేమ్‌లను ఎంపిక చేయాలి. 18 ఏళ్ల వరకూ ఫిల్టర్‌ లెవల్స్‌ ఉన్నాయి. అలాగే, సినిమాల్లో కేవలం ‘యూ’ సర్టిఫికెట్‌ సినిమాల్ని మాత్రమే ప్లే స్టోర్‌లో యాక్సెస్‌ అయ్యేలా చేయొచ్చు. మ్యూజిక్‌ని కూడా ఇదే మాదిరిగా ఫిల్టర్‌ చేయొచ్చు.

‘ఫ్యామిలీ’ యాప్‌ ఉంది

ష్‌!! గప్‌చుప్‌ యాప్‌ 

ఓ వయసుకి వచ్చాక టీనేజర్లకు స్మార్ట్‌ ఫోన్‌లు ఇవ్వక తప్పడం లేదు. అయినప్పటికీ పిల్లలు ఫోన్‌ని ఎంత సమయం వాడాలి? ఏయే అవసరాలకు వాడాలి? వేటికి అనుమతులివ్వాలి?.. లాంటి నిర్ణయాలు తల్లిదండ్రులే మేనేజ్‌ చేసేలా ‘గూగుల్‌ ఫ్యామిలీ లింక్‌’ యాప్‌ని అందిస్తోంది. ఇన్‌స్టాల్‌ చేసుకుని పిల్లలకు ప్రత్యేక ఎకౌంట్‌లను క్రియేట్‌ చేయొచ్చు. ‘యాక్టివిటీ రిపోర్టు’ల రూపంలో ఆండ్రాయిడ్‌ డివైజ్‌ల్లో ఏమేం చేస్తున్నారో మానిటర్‌ చేయొచ్చు. ఏయే యాప్‌లు ఇన్‌స్టాల్‌ అవ్వాలనేది కూడా మీరే నిర్ణయించొచ్చు. కొన్ని యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసేందుకు పిల్లలు ప్రయత్నిస్తే బ్లాక్‌ చేయొచ్చు. టీనేజర్లకు సరిపడే యాప్‌లను గూగుల్‌ రికమండ్‌ చేస్తే వాటిని పిల్లల ఫోనుల్లో ఇన్‌స్టాల్‌ చేయొచ్చు. నిర్ణీత సమయంలో మాత్రమే ఫోన్‌ని వాడేలా ‘టైమ్‌ లిమిట్స్‌’ని పెట్టే వీలుంది. అనివార్యమైతే వాడుతున్న ఫోన్‌ని లాక్‌ చెయ్యొచ్చు. 
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/ZfvyZb

పర్యవేక్షణ అనివార్యం

ష్‌!! గప్‌చుప్‌ యాప్‌ 

ఏదో కాసేపే కదా అని ఫోన్‌ని పిల్లల చేతికిచ్చేసి ఊరుకోవద్దు. అలాగైతే, మీరు ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. సాధారణంగా టీనేజర్లు ఫోన్‌లో ఏవో అనధికారిక సైట్‌ల నుంచి కొత్త సినిమా పాటల్ని డౌన్‌లోడ్‌ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని పాప్‌అప్‌ యాడ్‌లు వస్తుంటాయి. కొన్ని సార్లు పాటలు, సినిమాల డౌన్‌లోడ్స్‌కి బదులు ఇతర టూల్స్‌ డౌన్‌లోడ్‌ అయ్యే అవకాశాలే ఎక్కువ. అవి స్పైవేర్‌లు కావచ్చు. లేదంటే... మరేవైనా అడల్ట్‌ యాప్‌లైనా అయ్యుండొచ్చు. అందుకే నిత్యం మానిటర్‌ చేయాలి. తగిన సెక్యూరిటీ సెట్టింగ్స్‌ని పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే స్మార్ట్‌ఫోన్‌ని పిల్లల చేతికి ఇవ్వండి.

ప్రకటనల్ని బ్లాక్‌ చేయాలంటే?

ష్‌!! గప్‌చుప్‌ యాప్‌ 

వెబ్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఏదైనా ప్రకటనలు వస్తేనేగా సమస్య. అందువల్ల వాటిని అడ్డుకుంటే చాలా వరకు సమస్యలను నివారించుకున్నట్టే. అందుకు ప్రత్యేక యాప్‌లను వాడొచ్చు. వాటినే ‘యాడ్‌ బ్లాకర్స్‌’గా పిలుస్తున్నారు. ఉదాహరణకు ‘ఫ్రీ యాడ్‌బ్లాకర్‌ బ్రౌజర్‌’ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని మొబైల్‌ బ్రౌజర్‌లో పొడుచుకొచ్చే అన్ని రకాల యాడ్‌లు రాకుండా కట్టడి చేయొచ్చు.

డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/21SwpP 
పిల్లలకు ఇచ్చేముందు ఫోన్‌కి నెట్‌వర్క్‌ యాక్సెస్‌ లేకుండా చూసుకోండి. 
ఆఫ్‌లైన్‌ మోడ్‌లో మాత్రమే వాడేలా జాగ్రత్త పడాలి

ఫోన్‌ని తీసుకుని బయటికి వెళ్లిన పిల్లలు ఎక్కడున్నారో ట్రాక్‌ చేయొచ్చు. వారున్న లొకేషన్‌ని ఎప్పుడైనా యాక్సెస్‌ చేసి చూడొచ్చు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.