close

తాజా వార్తలు

ఐటీ కారిడార్‌లో ల్యాప్‌టాప్‌ దొంగలు 

ఉదయాన్నే చొరబడి అపహరిస్తున్న దుండగులు 
ఈనాడు, హైదరాబాద్‌

ఐటీ కారిడార్‌లో ల్యాప్‌టాప్‌ దొంగలు 

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం రాయదుర్గం ఠాణా పరిధిలోని ఓ ప్రైవేటు వసతిగృహం సమీపంలోనిది. ఇందులో ఉన్నది ఓ ల్యాప్‌టాప్‌ దొంగగా సైబరాబాద్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామునే వసతిగృహాల సమీపంలో తచ్చాడుతున్న ఈ అపరిచితుడు వీలు చిక్కితే చాలు ల్యాప్‌టాప్‌లు అపహరిస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా తనను గమనిస్తున్నారనుకుంటే మూగ, చెవిటి వాడిగా హావభావాల్ని ప్రదర్శిస్తున్నాడు. తాను దివ్యాంగుడినని చెప్పుకొనేలా ఓ పత్రాన్ని చూపెడుతూ డబ్బులు ఇవ్వమని ప్రాధేయపడుతున్నాడు. ఘనమైన ఇతడి లీలల్ని సీసీ ఫుటేజీల్లో పరిశీలించి దొంగగా నిర్ధారించుకున్న పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నారు. 
ఐటీ కారిడార్‌లో చోరీలు సరికొత్త రూపు సంతరించుకుంటున్నాయి. కేవలం ల్యాప్‌టాప్‌లే లక్ష్యంగా దొంగలు పంజా విసురుతున్నారు. ఈ ప్రాంతంలోని వసతిగృహాలతోపాటు ఇళ్లలో ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే నివసిస్తుండటంతో దొంగల దృష్టికోణం ల్యాప్‌టాప్‌లపైకి మళ్లింది. ఈ నేపథ్యంలో ఇదివరకే ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం, మాదాపూర్‌, గచ్చిబౌలి ఠాణాల పరిధిలో పలుమార్లు ల్యాప్‌టాప్‌లు చోరీలకు గురైన ఉదంతాలున్నాయి. వసతిగృహాల్లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వసతిగృహాలైతేలోనికి వెళ్లినా పెద్దగా అభ్యంతరం ఉండకపోవడంతో దొంగలు వీటిని ఎంచుకుంటున్నారు. పట్టపగలే దర్జాగా లోపలికి వెళ్తున్న దొంగలు ఎవరూ లేకపోతే వెంటనే ల్యాప్‌టాప్‌ల్ని సర్దేస్తున్నారు. ఒక్కో ల్యాప్‌టాప్‌ ధర రూ.20వేల నుంచి మొదలుకొని రూ.లక్ష వరకు ఉండటంతో ఒక్కటి దొరికినా చాలు అనే ధోరణిలో తెగిస్తున్నారు. గొలుసుచోరీలతోపాటు ఇళ్ల దొంగతనాలు జరిగితే పోలీసులు ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉండటంతో దొంగలు ల్యాప్‌టాప్‌లను ఎంచుకుంటున్నారు. చాలా సందర్భాల్లో వీటిని పోగొట్టుకున్న బాధితులు ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేసేందుకే వెనకడుగు వేస్తుంటారు. ఒకవేళ ఫిర్యాదు చేసినా పని ఒత్తిడి కారణంగా పోలీసులు ఆ ఫిర్యాదులపై దృష్టి పెట్టే అవకాశాలూ తక్కువే. అందుకే దొంగలు వరుస ఘటనలకు పాల్పడుతున్నారు. ల్యాప్‌టాప్‌ చోరీలు ఎక్కువగా జరిగినప్పుడు పోలీసులు ప్రత్యేక దృష్టితో నిందితుల్ని పట్టుకుంటున్నారు. 
ఆ హడావుడినే అనువుగా తీసుకొని.. 
దొంగలు ఎక్కువగా ఉదయం సమయాల్లోనే తమ చేతివాటం ప్రదర్శించేందుకు అనువైన సమయంగా ఎంచుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటలప్పుడు వసతిగృహాలకు చేరిపోతున్నారు. అప్పుడైతే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కార్యాలయాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యే హడావుడిలో ఉంటారు కాబట్టి తమను పెద్దగా పట్టించుకోరని దొంగలు భావిస్తున్నారు. ఆ సమయంలో ఎవరూ గమనించకపోతే ల్యాప్‌టాప్‌లను పట్టుకెళ్లిపోతున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.