close

తాజా వార్తలు

ప్రేమికుల రోజున ‘కన్నే కలైమానే’

ప్రేమికుల రోజున ‘కన్నే కలైమానే’

 కోడంబాక్కం: ఉదయనిధి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న చిత్రం ‘కన్నే కలైమానే’. తమన్నా కథానాయిక. శీనురామస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో తమన్నా నటిస్తున్న రెండో చిత్రమిది. గతంలో విజయ్‌సేతుపతికి జోడీగా ‘ధర్మదురై’లో ఆమె నటించారు. యువన్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగిల్‌ ట్రాక్‌ను నటుడు శివకార్తికేయన్‌ ట్విట్టర్‌లో విడుదల చేశారు. ‘ఎందన్‌ కన్గలై..’ అంటూ మొదలయ్యే ఈ పాటను ప్రియురాలి విరహవేదనను చాటేలా రూపొందించారు. ఈ మెలోడీ గీతాన్ని వైరముత్తు రాశారు. సూరజ్‌ సంతోష్‌ పాడారు. ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.